న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympic Medal Count: అమెరికాదే అగ్రస్థానం.. చైనాకు మళ్లీ నిరాశే! భారత్ స్థానం ఎన్నోదో తెలుసా?

Tokyo Olympics 2021: America top medal table, India finishes with 47th position

టోక్యో: ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ 2020 నేటితో ముగిసాయి. కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. వైరస్ కారణంగా గేమ్స్ ప్రారంభానికి ముందు టోక్యోలో ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు, గేమ్స్ విలేజ్‌లో అథ్లెట్లు కొవిడ్ బారిన ప‌డినా.. మొత్తానికి రెండు వారాల పాటు ప్ర‌పంచాన్ని ఉర్రూతలూగించాయి విశ్వ క్రీడలు. ఏడాది వాయిదా ప‌డి, అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా జ‌రిగిన తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావ‌డం విశేషం.

IND vs ENG:వర్షం అంతరాయం..చివరి రోజు ఆట ఆలస్యం!తొలి సెషన్ గోవిందా? భారత్ గెలవడం ఇష్టం లేదేమో!IND vs ENG:వర్షం అంతరాయం..చివరి రోజు ఆట ఆలస్యం!తొలి సెషన్ గోవిందా? భారత్ గెలవడం ఇష్టం లేదేమో!

వ‌రుస‌గా మూడోసారి:

వ‌రుస‌గా మూడోసారి:

ఎప్ప‌టిలాగే ఈసారి కూడా మెడ‌ల్స్ జాబితాలో టాప్‌లో ఉండ‌టానికి అమెరికా, చైనా పోటీపడ్డాయి. ఒలింపిక్స్ 2020లో చాలా రోజుల వ‌ర‌కూ టాప్‌లో ఉన్న చైనాను చివ‌రి రోజు అమెరికా వెన‌క్కి నెట్టింది. శ‌నివారం వ‌ర‌కూ చూస్తే చైనా 38 గోల్డ్ మెడ‌ల్స్‌తో టాప్‌లో ఉండ‌గా.. అమెరికా ఖాతాలో 36 మాత్ర‌మే ఉన్నాయి. అయితే ఆదివారం బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ల‌తో పాటు సైక్లిస్ట్ జెన్నిఫ‌ర్ వాలెంటీ కూడా గోల్డ్ గెల‌వ‌డంతో అగ్ర‌రాజ్యం అమెరికా మ‌ళ్లీ టాప్‌లోకి వెళ్లింది. ఒలింపిక్స్‌లో అత్య‌ధిక మెడ‌ల్స్‌తో అమెరికా ముగించ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారి. రికార్డు స్థాయిలో 600కుపైగా అథ్లెట్ల‌తో బ‌రిలోకి దిగిన అమెరికా.. మొత్తానికి త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలం చేసుకుంది. దీంతో చైనాకు మళ్లీ నిరాశే ఎదురైంది.

అగ్రస్థానంలో అమెరికా:

అగ్రస్థానంలో అమెరికా:

అమెరికా ఖాతాలో మొత్తం 113 మెడ‌ల్స్ ఉన్నాయి. ఇందులో 39 గోల్డ్ మెడ‌ల్స్‌. గోల్డ్‌మెడ‌ల్ ప‌రంగా చూసినా.. మొత్తంగా చూసినా అమెరికానే అగ్రస్థానంలోనే ఉంది. అయితే రియో గేమ్స్‌లో అమెరికాకు 121 మెడ‌ల్స్ వ‌చ్చాయి. అందులో 46 గోల్డ్ మెడ‌ల్స్ ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఈసారి అగ్ర‌రాజ్యం ప్ర‌ద‌ర్శ‌న అంత బాగాలేదు. అంతేకాదు ఆధునిక గేమ్స్ చ‌రిత్ర‌లో తొలిసారి అమెరికాకు ట్రాక్ ఈవెంట్‌ల‌లో ఒక్క వ్య‌క్తిగ‌త గోల్డ్ మెడ‌ల్ కూడా రాలేదు. చైనా 38 స్వ‌ర్ణాల‌తో పాటు మొత్తం 88 మెడ‌ల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. గోల్డ్ మెడ‌ల్స్ ప‌రంగా జ‌పాన్ (27), బ్రిట‌న్ (22), ర‌ష్య‌న్ ఒలింపిక్ క‌మిటీ (20) టాప్-5లో ఉన్నాయి.

47వ స్థానంలో భారత్:

47వ స్థానంలో భారత్:

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత్ ప‌రిస్థితి చాలా మెరుగైంద‌నే చెప్పాలి. రియో గేమ్స్‌లో 67వ స్థానంతో స‌రిపెట్టుకున్న భార‌త్‌.. ఈసారి ఏకంగా 19 స్థానాలు ఎగ‌బాకింది. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కూ భారత్ 66వ స్థానంలో కొనసాగుతూ వ‌చ్చింది. అయితే జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్‌ సాదించడంతో ఒక్కసారిగా 47వ స్థానానికి దూసుకొచ్చింది. భారత్ ఆటలు శనివారమే ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం ఆట‌లు ముగిసే స‌మ‌యానికి ఒక స్థానం దిగ‌జారి 48తో స‌రిపెట్టుకుంది. భారత్ ఖాతాలో 1 గోల్డ్‌, 2 సిల్వ‌ర్‌, 4 బ్రాంజ్ మెడ‌ల్స్ స‌హా మొత్తం 7 మెడ‌ల్స్ ఉన్నాయి. ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన అత్య‌ధిక మెడ‌ల్స్ ఇవే కావ‌డం విశేషం.

 క్లోజింగ్ సెర్మ‌నీతో గుడ్‌బై:

క్లోజింగ్ సెర్మ‌నీతో గుడ్‌బై:

19 రోజుల పాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఒలింపిక్స్‌.. ఆదివారం క్లోజింగ్ సెర్మ‌నీతో గుడ్‌బై చెప్పింది. ముగింపు సంద‌ర్భంగా మ‌రోసారి అన్ని దేశాల‌కు చెందిన అథ్లెట్లు త‌మ జాతీయ ప‌తాకాల‌తో స్టేడియంలోకి వ‌చ్చారు. భారత్ త‌ర‌ఫున బ్రాంజ్ మెడ‌ల్ విన్న‌ర్, రెజ్ల‌ర్ భ‌జ‌రంగ్ పూనియా త్రివ‌ర్ణ ప‌తాకంతో సంద‌డి చేశాడు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణిక‌స్తున్న స‌మ‌యంలో విజ‌యవంతంగా ఈ విశ్వ‌క్రీడా సంబ‌రాన్ని నిర్వ‌హించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జ‌పాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామ‌స్ బాక్‌తో క‌లిసి స్టేడియంలోకి వ‌చ్చారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌ 2020లో స్వ‌ర్ణాల బోణీని చైనా చేయ‌గా.. చివ‌రి గోల్డ్ మెడ‌ల్‌ను సెర్బియా అందుకుంది. ఆదివారం జ‌రిగిన మెన్స్ వాట‌ర్‌పోలో ఫైన‌ల్లో గ్రీస్‌పై గెలిచి సెర్బియా చివ‌రి గోల్డ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Monday, August 9, 2021, 8:52 [IST]
Other articles published on Aug 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X