న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 నిమిషాలే: స్వర్ణం సాధించిన సుశీల్ కుమార్

By Nageshwara Rao
Sushil Kumar strolls to national gold with three walkovers

హైదరాబాద్: ఇండోర్ వేదికగా జరుగుతున్న జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్, గీతా ఫోగట్ స్వర్ణ పతకాలతో మెరిశారు. మూడేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగినప్పటికీ తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని సుశీల్ నిరూపించాడు. 74 కేజీల విభాగంలో బరిలో దిగిన సుశీల్ మూడు నిమిషాల్లోపే స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

మ్యాట్‌పై సుశీల్‌ ప్రత్యర్థులతో తలపడింది కేవలం 2 నిమిషాల 33 సెకన్లే. ఆరంభ రౌండ్లలో ప్రత్యర్ధులను నిమిషంలోపే చిత్తుచేశాడు. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్లో ఎలాంటి పోటీలేకుండానే ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించింది. దీనిని బట్టి చూస్తే మొత్తంగా స్వర్ణం సాధించడంలో సుశీల్‌ అన్ని రౌండ్లలో కలిపి 2 నిమిషాల 33 సెకన్లు మాత్రమే పోరాడాడు.

ఫైనల్లో అతను ప్రవీణ్‌ రాణాతో తలపడాల్సి ఉండగా.. అతను గాయం కారణంగా తప్పుకున్నాడు. మరోవైపు ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌, గీత ఫొగట్‌‌లు కూడా స్వర్ణం గెలుచుకున్నారు. మహిళల 62కిలోల విభాగంలో రిసాక్షి మాలిక్ 10-0 తేడాతో పూజ(హర్యానా)పై అలవోక విజయం సాధించింది.

Sushil Kumar strolls to national gold with three walkovers

స్వర్ణం గెలిచిన సాక్షి మాలిక్, గీతా ఫోగట్
59 కిలోల తుదిపోరులో గీతా ఫోగట్.. రవితను ఓడించి స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే గీత ఫోగట్ భర్త పవన్‌ కుమార్‌ (86 కేజీలు) కూడా స్వర్ణం సాధించాడు. ఇదిలా ఉంటే రెజ్లర్ సందీప్‌ తులసీ యాదవ్‌పై నాడా క్రమశిక్షణ కమిటీ నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. గతేడాది అతను నిషేధిత ఉత్ప్రేరకం మెథాడియోనిన్‌ను తీసుకున్నట్లు జూన్ 25న జరిపిన పరీక్షలో తేలింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 18, 2017, 10:49 [IST]
Other articles published on Nov 18, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X