న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలుపు: ఆ ఓవర్ వల్లే భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

By Srinivas

ధర్మశాల: ట్వంటీ 20లో దక్షిణాఫ్రికా విజయానికి పదహారవ ఓవరే కారణమని జేపీ డుమిని చెప్పాడు. అప్పటి దాకా భారత్ మెరుగైన స్థితిలో ఉందని, 16వ ఓవర్ లో మూడు సిక్స్‌లు మ్యాచ్ గమనాన్ని మార్చివేశాయన్నాడు.

అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 22 పరుగులు చేసింది. దీంతో ఒక్కసారిగా రెండు జట్ల స్కోరు బోర్డు మధ్య వ్యత్యాసం తగ్గింది. ఆ ఓవర్ స్పూర్తితో తర్వాత నాలుగు ఓవర్లు బాగా ఆడామని, దీంతో విజయం సాధించామన్నాడు.

ఈ విజయం మరింత ఉత్సాహం ఇస్తుందని, ఇలాంటి ప్రారంభమే తమకు కావాల్సిందని డుమిని పేర్కొన్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. భారత్‌లో మంచి ప్రదర్శనకు ఐపీఎల్ చాలా ఉపయోగపడిందన్నాడు.

Sixteenth over was the turning point for South Africa, says Duminy

దెబ్బకు దెబ్బ తీస్తాం: రోహిత్ శర్మ

టీ20 మ్యాచ్‌లో సెంచరీ సాధించినా జట్టు విజయం సాధించకపోవడం నిరాశ కలిగిస్తోందని, తర్వాత మ్యాచ్‌లో పుంజుకుని ఆడి దెబ్బకు దెబ్బ తీస్తామని రోహిత్ శర్మ అన్నాడు. దేశం తరఫున ఏ ఫార్మాట్లో సెంచరీ చేసినా ఆనందాన్నిచ్చే విషయమేనని చెప్పాడు.

కానీ శతకం సాధించినా జట్టు గెలవకపోవడం నిరాశ కలిగిస్తోందన్నాడు. జట్టు గెలవనప్పుడు ఎన్ని పరుగులు చేశామన్నది ముఖ్యం కాదని, వ్యక్తిగతంగా ఈ ఇన్నింగ్స్‌ సంతోషాన్నిచ్చిందన్నాడు. సిరీస్‌ను విజయంతో ప్రారంభించడం కీలకమన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో కలిసికట్టుగా ఆడి విజయం సాధిస్తామన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X