న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ అథ్లెట్ మృతి

 Shock, grief as ex-World champ Nicholas Bett dies in tragic accident

హైదరాబాద్: ప్రముఖ అథ్లెట్‌.. కెన్యాకు చెందిన నికోలస్‌ బెట్‌(28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా హర్డల్స్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా నాంది కౌంటీలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బెట్‌ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

తీవ్రంగా గాయపడిన బెట్‌ ప్రమాద స్థలంలోనే మృతి చెందారని కౌంటీ అధికారులు తెలిపారు. బెట్‌ 2015లో జరిగిన 400 మీటర్ల హర్డల్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. చైనాలో జరిగిన షార్ట్‌ డిస్టెన్స్‌ హర్డల్స్‌ రేస్‌ పోటీల్లో విజేతగా నిలిచి చైనాలో ఆ ఘనత సాధించిన మొదటి కెన్యా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. రెండుసార్లు ఆఫ్రికా హర్డల్స్‌ చాంపియన్‌షిప్‌ సొంతం చేసుకున్నారు. బెట్‌ సోదరుడు హరోన్‌ కోయిచ్‌ కూడా 400 మీటర్ల హర్డ్‌లర్‌ కావడం విశేషం. కాగా, 2016 లో బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు బెట్‌ అర్హత సాధించలేదు.

కెన్యా అధికారిక స్పోర్ట్ ప్రతినిధి బార్నబా కొరీర్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరమైన విషయం. అతనితో ఒకరోజు ముందే మాట్లాడాను. అతనికి గాయం తగిలిన వెంటనే ఆసబాలోని ఆసుపత్రికి వెళ్లి చూశాను. తీవ్రమైన గాయాలతో ఉన్నాడు. కానీ, ఈ ఉదయమే అతనిక లేడనే విషయం తెలిసింది. ఆ వార్త వినగానే కెన్యా క్రీడారంగమంతా విషాదచాయలు అలముకున్నాయని చెప్పుకొచ్చారు.

నికోలస్ బెట్ వయస్సు 28 ఏళ్లు.కెన్నా అథ్లెటిక్స్ అసోసియేషన్ అతని కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేసింది. బెట్ కవల సోదరుడు ఆరోన్ కొచ్ కూడా హర్డ్లర్ జట్టులో సభ్యుడు కావడం గమనార్శం. అతను పేరిట కూడా స్వర్ణ పతకాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం నికోలస్ బెట్ గాయం కావడంతో అతను క్రీడలకు దూరంగా ఉంటున్నాడు.

Story first published: Wednesday, August 8, 2018, 15:43 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X