న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జున అవార్డు అందుకున్న ఆఫ్ స్నిన్నర్ అశ్విన్

By Nageswara Rao

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ శుక్రవారం అర్జున అవార్డును అందుకున్నారు. గతేడాది అశ్విన్‌కు క్రీడా విభాగంలో ఈ అవార్డుని ప్రకటించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2014 ఆగస్టు29వ తేదీన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఆసమయంలో టీమిండియా ఆఫ్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ తరుపున వన్డే మ్యాచ్‌లో పాల్గొన్నాడు. దీంతో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో శుక్రవారం క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ చేతుల మీదగా అశ్విన్ ఈరోజు అందుకున్నాడు.

Ravichandran Ashwin presented with his Arjuna Award

28ఏళ్ల అశ్విన్ టీమిండియా తరుపున 25 టెస్టు మ్యాచ్‌లాడి 124 వికెట్లు, 99 వన్డేల్లో 139 వికెట్లు, 25 టీట్వంటీ మ్యాచ్ లాడి 26 వికెట్లను తీశాడు. గడచిన 80 ఏళ్ల కాలంలో 100 వికెట్లను సాధించిన ఫాస్టెస్ట్ బౌలర్ అశ్వినే.

ముంబై వాంఖెడ్ స్టేడియంలో నవంబర్ 13న వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను సాధించాడు. అశ్విన్‌కి ఇది 19వ టెస్టు. అంతేకాదు సచిన్ టెండూల్కర్ చివరి టెస్టు మ్యాచ్ కూడా. గతేడాది అర్జున అవార్డు పొందిన వారులో మొత్తం 46 మంది క్రీడాకారులు ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X