న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత షూటర్లు మేటిగా రాణించాలి: ప్రధాని

PM Narendra Modi hails Indian shooters at ISSF Junior World Cup

హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ప్రోత్సహం అందించడంలో ముందుంటారని మరో సారి రుజువు చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. భారత బృందంలో చాలా మంది ప్రపంచ వేదికపై సత్తా చాటడంతో పాటు పతకాలు కూడా గెలిచారు.

విజయోత్సోహంతో భారత్ చేరుకున్న క్రీడాకారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ మోడీ ట్వీట్లు చేశారు. పతకం గెలిచిన ప్రతి షూటర్‌కి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలపుతూ ట్వీట్లు చేశారు. వారి గెలుపు ప్రాముఖ్యతను కొనియాడారు. పతకాలు గెలిచిన అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, వివాన్ కపూర్, మను భాకర్, గౌరవ్ రానా, అన్మోల్ జైన్, అనిష్, ముస్కాన్, గనెమత్ సెఖాన్‌లకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ప్రత్యేకంగా ట్వీట్లు చేశారు.

వాస్తవానికి మన యువ షూటర్లు పతకాలు గెలిచిన విషయమే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే మోదీ తన ట్వీట్‌తో వారి గొప్పతనాన్ని దేశ ప్రజలు తెలుసుకునేలా చేశారు. వారిని చూసి ఎంతో మంది యువత స్ఫూర్తిని పొందేలా చేశారు. అయితే ప్రతిభావంతులైన క్రీడాకారులకు మోదీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలపడం ఇది తొలిసారి కాదు.

గతంలో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2017లో రన్నరప్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టులో ప్రతి క్రీడాకారిణి గొప్పతనాన్ని మోడీ ఒక్కో ట్వీట్ ద్వారా వెల్లడించారు. వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అండర్-19 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు, బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, బాక్సర్ మేరీ కామ్ ప్రతి క్రీడాకారుడికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Monday, April 2, 2018, 9:38 [IST]
Other articles published on Apr 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X