న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రీడాకారులు ప్రపంచానికి భారత సత్తాను తెలియజేస్తారని నమ్ముతున్నా

PM Modi launches Khelo India School Games

హైదరాబాద్: తొలిసారిగా ప్రారంభించి నిర్వహిస్తోన్న ఖేలో ఇండియా స్కూల్‌గేమ్స్‌ (కేఐఎ్‌సజీ) బుధవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికై సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంటే సరిపోదు. క్రీడాభివృద్ధి, సాహిత్యం, కళలపై కూడా రాణించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన యువతలో క్రీడా నైపుణ్యానికి లోటు లేదని కొనియాడారు. భారత సత్తాను ప్రపంచానికి తెలియజేయడానికి ఈ క్రీడలు దోహదం చేస్తాయని మోడీ అన్నారు.

ఐపీఎల్ 2018: 8 జట్లకు చెందిన పూర్తి ఆటగాళ్ల వివరాలుఐపీఎల్ 2018: 8 జట్లకు చెందిన పూర్తి ఆటగాళ్ల వివరాలు

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారుల చిన్ననాటి కోచ్‌లను సత్కరిస్తామని చెప్పారు.

అండర్‌-17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌‌తో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 9:51 [IST]
Other articles published on Feb 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X