న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొండి పట్టుదలే స్వర్ణం తెచ్చేలా చేసింది: ఎవరీ మన్‌జీత్ సింగ్

By Nageshwara Rao
Asian Games 2018: Little-Known Manjit Singh Lands An Unexpected 800m Gold
Once close to quitting the sport, Manjit Singh Asian Games gold is a tale of unlikely glory

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆఖరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకున్న భారత అథ్లెట్‌ మన్‌జీత్ సింగ్ పురుషుల 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని సాధించి సంగతి తెలిసిందే. తద్వారా 1982 ఏషియాడ్‌ (చార్ల్స్‌ బొరోమియో) తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా మన్‌జీత్‌ అరుదైన ఘనత సాధించాడు.

నిజానికి రెండేళ్ల క్రితమే మన్‌జీత్‌ కెరీర్‌ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. 'ఇప్పటి వరకు నువ్వు చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఇంకా మెరుగుపర్చుకునే వయసు కూడా నీది కాదు' అంటూ ఓఎన్‌జీసీ చిన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగం నుంచి కూడా అతడిని తప్పించింది. దీంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. ఇలాంటి స్థితిలోనూ ఆ క్రీడాకారుడు స్థైర్యం కోల్పోలేదు.

 కొడుకు పుడితే చూడ్డానికి కూడా వెళ్లలేదు

కొడుకు పుడితే చూడ్డానికి కూడా వెళ్లలేదు

తానెంటో ప్రపంచానికి చాటి చెప్పే విషయంలో అతను ఎంత మొండి పట్టుదల పట్టాడంటే.. తనకు కొడుకు పుడితే చూడ్డానికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించి సగర్వంగా ఇంటికి వెళ్లబోతున్నాడు. ఆసియా గేమ్స్‌కు ముందు మన్‌జీత్ ఒక్క అంతర్జాతీయ పోటీలోనూ పతకం గెలిచింది లేదు. ఇక, జాతీయ స్థాయిలో ఆఖరి సారిగా 2013లో పతకం సాధించాడు. ఆ తర్వాత నుంచీ అతడి ప్రదర్శన పడిపోతూ వచ్చింది.

మన్‌జీత్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేకపోవడంతో

మన్‌జీత్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేకపోవడంతో

దీంతో ఓఎన్‌జీసీ ఈ ఏడాది మార్చిలో అతడిని తప్పించింది. మన్‌జీత్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేకపోవడంతో అతడి వల్ల సంస్థకు ఒనగూరుతున్న ప్రయోజనం ఏమీ లేదని తేల్చేసి, ఉపకార వేతనం ఆపేసింది. ఇలాంటి సమయంలో ఆర్మీ కోచ్‌ అమ్రిష్‌ కుమార్‌ మాత్రమే అండగా నిలిచారు. అప్పటి వరకు ఫలితాలు బాగా లేకపోయినా మన్‌జీత్‌లో ప్రతిభ ఉందని గుర్తించిన అమ్రిష్‌ ‘నీ జీవితంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా రెండేళ్లు నాకు ఇస్తే ఆసియా గేమ్స్‌లో పతకం సాధించేలా చేస్తాను' అని ప్రోత్సహించారు.

 రెండేళ్లు తీవ్రంగా కష్టపడిన మన్‌జీత్

రెండేళ్లు తీవ్రంగా కష్టపడిన మన్‌జీత్

అంతే... కోచ్‌కు మాట ఇచ్చి రెండేళ్లు అతను తీవ్రంగా కష్టపడ్డాడు. నెలకు 30 వేల సొంత ఖర్చుతో ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందాడు. అయినప్పటికీ, ఆసియా చాంపియన్‌షిప్, 2018 కామన్వెల్త్‌ క్రీడలకు కూడా అర్హత సాధించలేకపోయాడు. కానీ మన్‌జీత్‌ పట్టు వదల్లేదు. ఆసియా గేమ్స్ బెర్తు సాధించాడు.

100 మీటర్లు సమీపిస్తుండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ

అంతర్‌ జిల్లా అథ్లెటిక్స్‌లో రెండో స్థానం సాధించాడు. జాతీయ రికార్డుతో స్వర్ణం సాధించిన జిన్సన్‌ మీదే ఆసియా గేమ్స్‌లో అందరూ అంచనాలు పెట్టుకున్నారు. సెమీఫైనల్లో ఎనిమిదో స్థానంలో నిలిచి అతి కష్టం మీద ఫైనల్‌కు అర్హత సాధించిన మన్‌జీత్ ఫైనల్ రేసులో అద్భుతమే చేశాడు. చివరి 100 మీటర్లు సమీపిస్తుండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంజీత్‌ మరింత వేగంగా పరుగెత్తాడు.

కొడుకును చూసేందుకు సిద్ధమవుతున్న మన్‌జీత్

అందరినీ దాటేస్తూ 800 మీటర్ల విజేతగా నిలిచి స్వర్ణ పతకం అందుకున్నాడు. ఈ ఏడాది మార్చి 6న అతనికి కొడుకు పుట్టినా చూడ్డానికి వెళ్లలేదు. కోచ్‌ దగ్గరే ఉండి సాధనకే అంకితమయ్యాడు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచాక కొడుకును చూసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘‘నా కొడుకును చూడాలని, పతకం చూపించాలని ఉంది. తన తండ్రి ఏం సాధించాడో అతను తెలుసుకోవాలి'' అని మంజీత్‌ ఉద్వేగంతో చెప్పాడు.

Story first published: Wednesday, August 29, 2018, 12:44 [IST]
Other articles published on Aug 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X