న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bajrang Punia: 'పతకమే నాకు ముఖ్యం.. కాలు విరిగినా సంతోషపడేవాడిని'

Olympics 2020: Bajrang Punia says Its ok if there is a fracture, medal is important
Bajrang Punia : మోకాలు కంటే మెడల్ ముఖ్యం.. పట్టి లేకుండా రిస్క్ || Oneindia Telugu

ఢిల్లీ: మ్యాచ్ ఆడుతుండగా కాలు విరిగినా సరే.. పతకం గెలవాలనుకున్నా అని భారత స్టార్ రెజ్లర్, బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా తెలిపాడు. పతకమైతే గెలవాలన్న కసితో కాంస్య పతక పోరులో ఆడాడని చెప్పాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2020లో మోకాలి గాయం కారణంగానే సెమీస్‌లో బజరంగ్ ఓడిన విషయం తెలిసిందే. 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీస్‌లో బజరంగ్ అజర్ బైజానికి చెందిన హాజీ అలియెవ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. టోక్యో నుంచి సోమవారం స్వదేశానికి తిరిగొచ్చిన బజరంగ్​ పునియాకు ఘన స్వాగతం పలికారు. కొంత రెస్ట్ తీసుకున్న బజరంగ్ వరుసగా మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నాడు.

IND Vs ENG 2nd Test: జో రూట్‌ హాఫ్‌ సెంచరీ.. బెయిర్‌స్టో బాదుడు! ఇంగ్లండ్‌ స్కోర్173/3!IND Vs ENG 2nd Test: జో రూట్‌ హాఫ్‌ సెంచరీ.. బెయిర్‌స్టో బాదుడు! ఇంగ్లండ్‌ స్కోర్173/3!

తాజాగా ఓ జాతీయ మీడియాతో బజరంగ్ పునియా మాట్లాడుతూ... 'ఒలింపిక్స్​ 2020కు ముందు నా కుడి మోకాలికి గాయమైంది. దీంతో విశ్వ క్రీడల్లో ఆడటంపై సందిగ్ధత ఏర్పడింది. డాక్టర్ల సూచనలతో టోక్యోలో మ్యాచ్​లు ఆడాను. వారు నా మోకాలికి పట్టీలు ఇచ్చారు.ప్లేఆఫ్​కు మ్యాచ్​లకు కాలికి పట్టీ ధరించి ఆడాల్సి వచ్చింది. దీంతో నా ఫుట్​వర్క్​ కదలికలకు అడ్డంకి ఏర్పడింది. అందుకే సెమీస్​లో ఓడిపోయాను. దీంతో కాంస్య పతక పోరులో నేను పట్టి లేకుండానే బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నాను. కాలి గాయం ఎక్కువైనా సరే.. పతకమైతే గెలవాలనుకున్నా. చివరికి కాలు విరిగితే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాను' అని తెలిపాడు.

'సెమీస్‌లో హజీ అలియెవ్‌ చేతిలో ఓటమి తర్వాత నా గదిలోకి వెళ్లి త్వరగా పడుకున్నా. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి ఫోన్‌ చేసి అమ్మతో చాలా సమయం మాట్లాడా. రెజ్లింగ్‌ కన్నా ఎక్కువగా నా గాయం గురించే అమ్మ భయపడుతున్నట్టు చెప్పింది. గెలుపోటములు ఆటలో భాగమంది. ముందు నా మోకాలిని రక్షించుకోవాలని సూచించింది. పతకం కన్నా నా ఆరోగ్యమే ముఖ్యమని అమ్మ చెప్పింది' అని బజరంగ్‌ పూనియా అన్నాడు.

'పిల్లలు మెడల్స్ గెలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గాయంతోనే గెలిచిన ఈ కాంస్యం తమకు బంగారంతో సమానమని నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే గాయం వల్ల నేను రష్యాలో 20-25 రోజులు మ్యాటుకు దూరమయ్యాననే విషయం వారికి తెలుసు. పతకం వచ్చినందుకు వారు చాలా ఆనందించారు' అని బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా వెల్లడించాడు.

ఒలింపిక్స్​ 2002కు ముందు రష్యా వేదికగా జరిగిన అలీ అలియేవ్​ టోర్నీ సందర్భంగా స్థానిక రెజ్లర్​ అబుల్మాజిద్​ కుదియేవ్​తో పోరులో బజ్​రంగ్ గాయపడ్డాడు. అతిపెద్ద ఈవెంట్​కు ముందు గాయం బారిన పడటం వల్ల కొంత నిరాశకు లోనయ్యాడు. ఒలింపిక్స్​లో చాలామంది ఒత్తిడి కారణంగానే ఓడిపోతుంటారు. దీంతో పతకం గెలవాలంటే ఒత్తిడిని దరిచేరనీయకూడదని పూనియా సంకల్పించాడు. ఆ సూత్రాన్ని విజయవంతంగా పాటించి ఒలింపిక్స్​ 2020లో పతకం సాధించాడు.

Story first published: Saturday, August 14, 2021, 18:00 [IST]
Other articles published on Aug 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X