న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్లోంచి తోసేసిన పోలీసులు': జాతీయ అథ్లెట్ మృతి

By Pratap

మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. జాతీయ అథ్లెట్, ఫెన్సింగ్ ఛాంపియన్(కత్తియుద్ధం) హోసియర్ సింగ్‌ను రైల్వే పోలీసులు కదులుతున్న రైలు నుంచి తోసేశారు. దీంతో అథ్లెట్ మృతిచెందాడు.

హోసియర్ మధుర నుంచి స్వస్థలమైన కాస్‌గంజ్‌కు తల్లి, భార్యతో కలిసి రైలులో తిరిగివెళ్తున్నాడు. తల్లి, భార్య మహిళా కోచ్‌లో కూర్చోగా హోసియర్ జనరల్ కోచ్‌లో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత అనారోగ్యంతో ఉన్న భార్య ఫోన్ పిలుపుతో హోసియర్ మహిళా కోచ్‌లోకి వెళ్లాడు. మహిళా కోచ్‌లో ఉన్నందుకు రైల్వే పోలీసులు అతడివద్ద నుంచి రూ. 200 డిమాండ్ చేశారు.

 National level athlete dies after being pushed off a moving train by Railway Police

వచ్చే స్టేషన్‌లో దిగివెళ్లిపోతానని చెప్పి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు బూతులు తిడుతూ హోసియర్‌ను కదులుతున్న రైలు నుంచి తోసేశారు. ఈ ఘటనలో అతడు మృతిచెందాడు.

కాగా, హోసియార్ రైలులోంచి జారి పడి మరణించాడని రైల్వే పోలీసులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తోసేయడం వల్లనే తన భర్త మరణించాడని హోసియార్ సింగ్ భార్య అంటోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X