న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పద్మ అవార్డు అందుకోబోతున్న ఆరుగురు క్రీడాకారులు వీరే

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం భారత దేశంలోని ఉన్నత పురస్కార విభాగాలలో ఒకటైన పద్మ అవార్డులు ఆరుగురు క్రీడాకారులను వరించాయి. వారిలో దేశానికి క్రికెట్ నుంచి రెండు ప్రపంచకప్‌లు అందించిన మాజీ కెప్టెన్ ధోనీ ఉండటం గర్వకారణం.

 దేశానికి రెండు ప్రపంచ క‌ప్‌లు అందించిన ధోని..

దేశానికి రెండు ప్రపంచ క‌ప్‌లు అందించిన ధోని..

మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్‌ చరిత్రలో చరిత్ర సృష్టించాడు. మరెవరికీ సాధ్యం కానన్ని ఘనతలు సాధించాడు. కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు అందిచాడు. 2007లో కెరీర్‌ ఆరంభ దశలోనే దేశానికి తొలి టీ20 ప్రపంచకప్‌ సాధించిపెట్టాడు. 2011లో స్వదేశంలో భారత్‌ వన్డే ప్రపంచ కప్‌ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

 మూడు ఐసీసీ ట్రోఫీలను అందుకుని:

మూడు ఐసీసీ ట్రోఫీలను అందుకుని:

2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టును గెలిపించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను అందుకున్న ఏకైక సారథి అతడే. అతడి సారథ్యంలోనే భారత్‌ టెస్టుల్లోనూ నం.1 జట్టుగా ఆవిర్భవించింది. మేటి ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ధోని.. ఆటతోనే కాదు తన ప్రవర్తనతోనూ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. భారత క్రికెట్లో గొప్ప నాయకుల్లో అతడు ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు.

లిన్‌ డాన్‌ను సొంతగడ్డ చైనాలోనే ఓడించి:

లిన్‌ డాన్‌ను సొంతగడ్డ చైనాలోనే ఓడించి:

కిదాంబి శ్రీకాంత్‌.. పురుషుల విభాగంలో ప్రస్తుతం భారత అత్యుత్తమ షట్లర్‌. నాలుగేళ్ల కిందట ప్రపంచ దిగ్గజం లిన్‌ డాన్‌ను అతడి సొంతగడ్డ చైనాలో ఓడించి ప్రకంపనలు సృష్టించిన శ్రీకాంత్‌.. నిరుడు నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో తానేంటో నిరూపించుకున్నాడు. ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో దిగ్గజాల సరసన నిలిచాడు. మొత్తం మీద 6 సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో సత్తా చాటాడు. ‘‘పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో దేశం గర్వించే విజయాలు మరెన్నో సాధిస్తాను'' అని శ్రీకాంత్‌ పేర్కొన్నాడు.

 2004లో అర్జున అవార్డు:

2004లో అర్జున అవార్డు:

పద్దెనిమిది ప్రపంచ టైటిళ్లు.. ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఆరు ఆసియా టైటిళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది పంకజ్‌ అడ్వానీ సాధించిన టైటిళ్ల జాబితా. పద్దెనిమిదేళ్ల వయసులో తొలి ప్రపంచ టైటిల్‌ సాధించాడు. ఆ తర్వాత 14 ఏళ్లలో మరో 17 ప్రపంచ టైటిళ్లు గెలిచాడు. అడ్వాణీ 2004లో అర్జున అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతేగాక 2008లో రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న లభించింది. ఆ తర్వాత ఏడాది అతడికి పద్మ శ్రీ పురస్కారం దక్కింది.

 ముగ్గురు ముగ్గురే:

ముగ్గురు ముగ్గురే:

1995లో మల్లీశ్వరి తర్వాత స్వర్ణం సాధించిన భారత లిఫ్టర్‌గా మీరాబాయి చాను గుర్తింపు తెచ్చుకుంది. 1995లో మల్లీశ్వరి తర్వాత స్వర్ణం సాధించిన భారత లిఫ్టర్‌గా ఆమె గుర్తింపు పొందింది. దేశానికి స్వర్ణం అందించిన మీరాబాయి చానుకు తగిన గుర్తింపు లభించింది. సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ డేవిస్‌కప్‌లో అద్భుత విజయాలు అందుకున్నాడు. లియాండర్ పేస్‌ తర్వాత టాప్‌-100లోకి దూసుకెళ్లిన ఆటగాడు అతడే.

Story first published: Friday, January 26, 2018, 11:33 [IST]
Other articles published on Jan 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X