రెండోసారి తండ్రయిన మైఖేల్ ఫెల్ప్స్: తనయుడి పేరేంటో తెలుసా?

Posted By:
Michael Phelps Announces Birth of Second Son, Beckett

హైదరాబాద్: ప్రపంచం మొత్తం వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా ప్యాంగ్ చాంగ్ నగరంవైపు చూస్తుండగా... మాజీ అమెరికా స్విమ్మింగ్ సూపర్‌స్టార్ మైఖేల్ ఫెల్ప్స్ రెండోసారి తండ్రయ్యాడు. ఫెల్ప్స్ భార్య నికోల్ రెండోసారి పండంటి బాబుకు జన్మనిచ్చింది.

ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫెల్ప్స్ అభిమానులతో పంచుకున్నాడు. 'జీవితంలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాను. నేను, నికోల్.. బెకెట్ రిచర్డ్ ఫెల్ప్స్‌ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. తల్లి, బాబు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. మాటలకందని సంతోషంతో ఉబ్బితబ్బివవుతున్నాను' అని ఫెల్ప్స్ తని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

అంతకముందు ఫెల్ప్స్‌ దంపతులు మే 2016లో తొలిసారి బూమర్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. ఒలింపిక్స్‌లో 23 బంగారు పతకాలను సొంతం చేసుకున్న 32 ఏళ్ల ఫెల్ప్స్ 2016 రియో ఒలింపిక్స్‌లో తన అద్వితీయ స్విమ్మింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఫెల్ప్స్ ఖాతాలో మొత్తం 28 పతకాలు ఉన్నాయి. గతేడాది రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో ఐదు బంగారు, ఒక రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, 2020లో సమ్మర్ ఒలింపిక్స్‌కు జపాన్‌లోని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, February 15, 2018, 11:53 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి