షూటింగ్‌లో మెరుపులా మెరిసింది: ఎవరీ మను భకర్..? గతమేంటి..?

Posted By:
Manu Bhaker, jack of all trades and master of one

హైదరాబాద్: మెక్సికోలో నిర్వహించిన ప్రపంచకప్ పోటీల్లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న తర్వాతనే మను భకర్ ప్రపంచానికి పరిచయమైంది. తను షూటింగ్‌లో బంగారు పతకాలు తీసుకున్నంత మాత్రాన తనకు అదొక్కటే తెలుసని అనుకోవడానికి లేదు. ఆమె 2016నుంచే షూటింగ్ ను తన కెరీర్‌లో సీరియస్‌గా తీసుకుంది.

మెక్సికో వేదికగా జరుగుతోన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సీనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్ పోటీల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తాజాగా మరో స్వర్ణం భారత్‌ ఖాతాలో చేరింది. ఈ టోర్నీలో యువ షూటర్‌ మను భకర్‌ సంచలనాలు సృష్టిస్తోంది.

సంచలనాలు సృష్టిస్తూ..: భారత యువ షూటర్‌ మను బాకర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో ఒక్క రోజు వ్యవధిలో రెండు స్వర్ణాలతో సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల మను సోమవారం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె టీమ్‌ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. మను, ఓంప్రకాశ్‌ మితర్వాల్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో 476.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయింగ్‌ రౌండ్లో మను-ఓం ప్రకాశ్‌ 770 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించారు.

అసలెలా..?

తన తండ్రి రామ్ కిషన్ బాకర్ మర్చంట్ నేవీ హైలింగ్‌లో ఇంజినీర్. ఆయన తన దగ్గర ఉన్న రివాల్వర్‌ను శిక్షణ నిమిత్తం ఇవ్వడంతోనే ఆమె నేర్చుకోగలిగింది. ఈ రెండేళ్లలోనే మను ప్రపంచానికి తెలిసేంత సత్తా తెచ్చుకోగలిగిందని అతని తండ్రి బదులిచ్చాడు.

మను జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు:

1. మను రాష్ట్ర స్థాయి బాక్సర్, తను ఆరేళ్ల వయస్సున్నప్పటి నుంచి శిక్షణ తీసుకోవడం మొదలెట్టింది.
2. బాక్సింగ్‌తో పాటుగా ఈమె మణిపురీ ప్రాంతానికి చెందిన టాంగ్ టా మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణురాలు.
3. జాతీయ స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఘనత కూడా మను బాకర్‌కు ఉంది.
4. స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు గెలుచుకుంది.
5. మను తన బోర్డ్ పరీక్షల్లో వంద శాతం మార్కులతో పాసై డాక్టర్ అవ్వాలని కలలకనేది.
6. ఈ షూటింగ్ విభాగంలో నరేశ్ దగ్గర ప్రాథమిక విద్యను నేర్చుకుని ఇంకాస్త మెరుగైన నైపుణ్యం కోసం జాస్పల్ రానా వద్ద శిక్షణ తీసుకుంది.

ఆమె మాటల్లో..

''నా ప్రదర్శన నమ్మశక్యంగా లేదు. ప్రపంచకప్‌ను రెండు స్వర్ణాలతో ముగిస్తానని అస్సలు అనుకోలేదు. పతకాల గురించి, రికార్డుల గురించి నేను ఆలోచించలేదు. అవి అలా జరిగిపోయాయంతే. నేను గెలుస్తున్నపుడు రికార్డులు సృష్టిస్తున్నట్లు నాకు తెలియదు. నా టెక్నిక్‌ మీద గంటలు గంటలు పని చేసి, నాకెన్నో విలువైన సలహాలిచ్చిన నా కోచ్‌లకు కృతజ్ఞతలు'' - మను బాకర్‌

Story first published: Tuesday, March 6, 2018, 17:12 [IST]
Other articles published on Mar 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి