న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది, ఇలాంటి వారు అరుదు

Manika Batra gave this answer on PM Modis fitness challenge ...

హైదరాబాద్: కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ చేసిన ఛాలెంజ్ విరాట్ కోహ్లీ స్వీకరించాడు. కోహ్లీ దానిని అనుష్క శర్మ, ప్రధాని మోడీకి పంపాడు. దానికి స్పందించిన మోడీ తప్పకుండా పంపుతానంటూ..
కొద్ది రోజుల అనంతరం.. యోగా.. ప్రాణాయామంతో పాటు మరి కొన్ని వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. ఇక్కడితో తన ఛాలెంజ్‌ను పూర్తి చేసుకున్న మోడీ మళ్లీ దానిని కర్ణాటక ముఖ్యమంత్రలకు, 40ఏళ్లు పైబడిన ఐపీఎల్ ఆఫీసర్లకు ఫార్వార్డ్ చేశాడు. వారితో పాటుగా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్సిస్ విభాగంలో నాలుగు పతకాలు సాధించిన మానికా బాత్రాకు పంపారు.

'హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌'కు నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తి ఛాలెంజ్‌పై భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని తనకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తనను గుర్తించి ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్‌నెస్‌ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించారు.

మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకుంది.

అతికొద్ది మందిలో మోదీ ఒకరు: రాజ్యవర్థన్‌ రాథోడ్‌
'హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌'లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్‌నెస్‌ విడుదల చేయడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రధాని తరచుగా యువత ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్‌నెస్‌ వీడియోలు షేర్‌ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా మంచిధోరణిలో వెళ్తోందని' రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ వివరించారు.

Story first published: Wednesday, June 13, 2018, 14:19 [IST]
Other articles published on Jun 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X