న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హామిల్టన్‌దే రష్యన్‌ గ్రాండ్‌ ప్రీ: కెరీర్‌లో 70వ విజయం

Lewis Hamilton claims win I am least proud of at Russian GP

హైదరాబాద్: బ్రిటన్‌ ఫార్ములా వన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) తన జోరుని కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా హామిల్టన్‌ రష్యన్‌ గ్రాండ్‌ ప్రీలోనూ సత్తాచాటాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసులో చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆసియా కప్ పోరులో యువ భారత్ జోరుఆసియా కప్ పోరులో యువ భారత్ జోరు

నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్‌ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. 'పోల్‌ పొజిషన్‌'తో రేసును ఆరంభించిన బొటాస్‌ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్‌ వరకు రెడ్‌బుల్‌ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌కు(ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్‌ రెండో స్థానంలో, హామిల్టన్‌ మూడో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్‌టేక్‌ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్‌ జట్టు టీమ్‌ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది. జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్‌ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్‌టేక్‌ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్‌ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు.

చివరి ల్యాప్‌ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. హామిల్టన్‌కు ఇది రష్యాలో మూడో విజయం కాగా.. ఓవరాల్‌గా కెరీర్‌లో 70వ విజయం కావడం విశేషం. అంతేకాదు ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిక్యాన్ని 50 పాయింట్లకు పెంచుకున్నాడు. ఇక, భారత్‌కు చెందిన రేసింగ్ పాయింట్ డ్రైవర్లు ఒకాన్, పెరెజ్‌ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు.

21 రేసుల ఈ సీజన్‌లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్‌ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్‌ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ సీజన్‌లోని తర్వాతి రేసు జపాన్‌ గ్రాండ్‌ ప్రి అక్టోబర్ 7న జరగనుంది.

Story first published: Monday, October 1, 2018, 13:32 [IST]
Other articles published on Oct 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X