న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధికారుల ఆసరా కరువై ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయి..

Junior India shooters stranded at Bangkok airport after emergency landing

హైదరాబాద్: అధికారుల ఆసరా కరువై జూనియర్ క్రీడాకారులు తిరుగు ప్రయాణంలో తిప్పలు కొనితెచ్చుకున్నారు. అధికారులు మాత్రం సరైన సమయంలో అందుబాటులో లేకుండా అంతా అయిపోయాక మేమున్నామని చెప్పుకొస్తున్నారు. అనుకోకుండా అదే సమయంలో వారి ఫోన్‌లు కూడా పని చేయకపోవడంతో తల్లిదండ్రులు గందరగోళానికి గురైయ్యారు.

జూనియర్ షూటర్లు బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో

జూనియర్ షూటర్లు బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో

భారత దేశానికి చెందిన 11 మంది జూనియర్ షూటర్లు బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వీరంతా దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. కానీ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావాల్సి రావడంతో బుధవారం వీరు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో గడపాల్సి వచ్చింది.

సాంకేతిక సమస్య తలెత్తినట్టు సిబ్బంది

సాంకేతిక సమస్య తలెత్తినట్టు సిబ్బంది

పదకొండు మంది షూటర్లే ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారు. చాంగ్వాన్ నుంచి బ్యాంకాక్ చేరుకున్న వీరు థాయ్ ఎయిర్‌వేస్ ద్వారా ఢిల్లీ బయల్దేరారు. కానీ టేకాఫ్ అయిన అర గంట సమయం తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి బ్యాంకాక్ మళ్లించారు. ఆటగాళ్లకు తోడుగా సీనియర్ అధికారి గానీ కోచ్ గానీ లేకపోవడం గమనార్హం.

పిల్లలు అయోమయానికి గురైయ్యారని:

పిల్లలు అయోమయానికి గురైయ్యారని:

‘మా అబ్బాయి బ్యాంకాక్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోన్ చేశాడు. ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని చెప్పాడు. వారికి పెద్దవాళ్లెవరూ తోడు లేకపోవడంతో భయమేసింది. చాలా మంది పిల్లల సెల్‌ఫోన్లు పని చేయడం లేదు. ప్రయాణాల సమయంలో షూటింగ్ ఫెడరేషన్ లేదా స్పోర్ట్స్ అథారిటీకి చెందిన అధికారులు తప్పకుండా తోడుగా వెళ్లాలి' అని ఓ షూటర్ తండ్రి తెలిపాడు.

అధికారులు తప్పకుండా తోడుగా :

అధికారులు తప్పకుండా తోడుగా :

చాంగ్వాన్ నుంచి బ్యాంకాక్ వరకూ జూనియర్ షూటర్లకు ఇద్దరు కోచ్‌లు తోడుగా ఉన్నారని నేషనల్ రైఫిల్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ తెలిపారు. షూటర్లు ఢిల్లీ ఫ్లయిట్‌ ఎక్కిన గంట తర్వాత కోచ్‌లు ముంబై వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నారని ఆయన చెప్పారు. షూటర్లు విమానం ఎక్కిన తర్వాతే కోచ్‌లు వేరే విమానం ఎక్కేలా ప్లాన్ చేశామని తెలిపారు.

Story first published: Thursday, September 13, 2018, 15:51 [IST]
Other articles published on Sep 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X