జకార్తా: భారత్ పతకాల ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. 1500మీ. పరుగు పందెంలో జిన్సన్ జాన్సన్ సాధించిన స్వర్ణంతో భారత్‌కు మొత్తం 12 స్వర్ణాలు వచ్చినట్లు అయింది. ఫైనల్ పోటీల్లో 3:44.72ల కాల వ్యవధిలో అతను నిర్దిష్ట దూరాన్ని దాటగలిగాడు. ఈ పతకంతో భారత్ ఖాతాలో 12 స్వర్ణాలు 20 రజతాలు 25 కాంస్యాలు వచ్చి చేరినట్లు అయింది.
ఆసియా గేమ్స్‌లో భారత్ పాల్గొనేందుకు గురువారమే ఆఖరి రోజు. ఇంతకుముందు ఒకసారి 800మీ. పరుగు పందెంలో రజతాన్ని అందుకున్న జాన్సన్ మళ్లీ స్వర్ణం దక్కించుకుని భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు.
భారత్‌కు చెందిన మహిళా క్రీడాకారిణి 1500మీ పరుగు పందెంలో చిత్ర కాంస్యాన్ని దక్కించుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 55వ పతకం వచ్చి చేరింది.
Here's the GOLD number SIX for #TeamIndiaAthletics at #AsianGames2018 #JJ Jinson Johnson wins men's 1500m Final in style with the timing of 3:44.72
— Athletics Federation of India (@afiindia) August 30, 2018
What a run in that last lap #JJ, simply superb!!@IndiaSports @g_rajaraman @Media_SAI @IndiaSports @Ra_THORe @asiangames2018 pic.twitter.com/ozEjtHAThA