న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియోలో జిమ్నాస్ట్ కంటతడి: అందరికీ వినించిన కాలువిరిగిన శబ్ధం

రియో డీ జెనీరో: ఎన్నో ఆశలతో ప్రపంంచంలోనే ప్రతిష్టాత్మక క్రీడా పోటీ అయిన రియోలో అడుగుపెట్టిన ఆ క్రీడాకారుడు కల నెరవేరకుండానే ఆస్పత్రికి చేరాడు. ఫ్రెంచ్ ఒలింపియన్ జిమ్నాస్ట్ సమీర్ అయిత్(26) పోటీలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా ప్రమాదవశాత్తు క్రాష్ ల్యాండింగ్ అయ్యాడు. దీంతో అతని ఎడమ కాలు విరిగిపోయింది.

అది ఎంతలా అంటే కాలి ఎముక విరిగిన చప్పుడు ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించింది. కింద పడగానే సమిర్‌ బాధతో విలవిలలాడిపోయాడు. కాలు విరిగిన బాధను బయటకు రానివ్వకుండా కళ్లపై చేతులు వేసుకుని కన్నీటిని అదుపుచేసుకునే ప్రయత్నం చేశాడు సమీర్. కాలు విరిగి కుప్పకూలిన సమీర్‌కు ప్రేక్షకులు స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చి గౌరవించారు. ఒలింపిక్ సిబ్బంది వెంటనే సమీర్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Injured French gymnast Said undergoes surgery

గాయంతో వెనుదిరిగిన ఆతిథ్య జట్టు క్రీడాకారిణి

జూడోలో కచ్చితంగా పతకం గెలుస్తుందనుకున్న ఆతిథ్య బ్రెజిల్‌ అథ్లెట్‌ సారా మెనెజెస్‌ కూడా గాయంతో దిగ్భ్రాంతికర రీతిలో నిష్క్రమించింది. లండన్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి, ఈసారి సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సారా.. బౌట్‌ సందర్భంగా గాయపడింది.

మంగోలియా జూడోకా ముంక్‌బాట్‌తో హోరాహోరీగా తలపడే క్రమంలో ఆమె మోచేయి పక్కకు తొలిగింది. దీంతో ఆమె బౌట్‌ కొనసాగించలేకపోయింది. పోటీ చివర్లో ప్రత్యర్థికి సంప్రదాయబద్ధం చేసే అభివాదం కూడా చేయలేకపోయింది సారా. స్వర్ణం గెలుస్తుందనుకున్న సారాకు ఇలాంటి పరిస్థితి రావడం చూసి అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. పతకం సాధించలేదన్న తీవ్రమైన బాధతో ఈ క్రీడాకారిణి వెనుదిరిగింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X