కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్లో భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ప్రారంభమయిన మూడో టెస్ట్ వర్షం కారణంగ ఆగిపోయింది. మొదట టాస్ గెలిచి ధోనీ బౌలింగ్ ఎంచుకొని దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పజెప్పాడు. అయితే దక్షిణాఫ్రికా స్కోరు 21 పరుగుల వద్ద ఉండగా వర్షం ప్రారంభం కావడంతో ఆట ఆగిపోయింది. పిచ్ తడవకుండా కవర్లతో కప్పివుంచారు. కాగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ప్రారంభంలోనే ఒక వికెట్ కోల్పోయింది. 17 పరుగుల వద్ద తొలి వికెట్‌గా స్మిత్‌ను కోల్పోయింది. కెప్టెన్ స్మిత్ (6)ను జహీర్‌ఖాన్ పెవిలియన్ దారి పట్టించాడు. పీటర్‌సన్ (13), ఆమ్లా (1) క్రీజ్‌లో ఉండగా వర్షం రావడంతో ఆట ఆగిపోయింది.
Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి.
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on
Nov 14, 2017