న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పీడ్ స్కేటింగ్: 0.01 సెకన్‌లో ఒలింపిక్ రికార్డు బద్దలు

By Nageshwara Rao
Havard Lorentzen wins 500m gold, sets new Olympic record

హైదరాబాద్: దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ వేదికగా జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ పోటీల్లో ఇప్పటికే అనేక రికార్డులు నమోదగా, మరికొన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. తాజాగా నార్వేకు చెందిన హవర్డ్ లోరెన్డజెన్ వింటర్ ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డుని సాధించాడు.

కేవలం 0.01 సెకన్లలో రేసు పూర్తి

కేవలం 0.01 సెకన్లలో రేసు పూర్తి

స్పీడ్ స్కేటింగ్‌ 500 మీటర్ల ఈవెంట్లో కేవలం 0.01 సెకన్లలో వ్యవధిలో పోటీని పూర్తి చేసి గత ఒలింపిక్ రికార్డుని తిరగరాశాడు. 2002లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌ 500 మీటర్ల ఈవెంట్‌లో అమెరికాకు చెందిన కేసీ ఫిట్జన్‌డోల్ప్ నమోదు చేసిన 34.42 సెకన్లే ఇప్పటి వరకు అత్యుత్తమం.

500 మీటర్ల ఈవెంట్‌లో 34.41 సెకన్లలో

500 మీటర్ల ఈవెంట్‌లో 34.41 సెకన్లలో

తాజాగా ప్యాంగ్ చాంగ్‌లో జరుగుతోన్న ఒలింపిక్స్‌లో స్పీడ్ స్కేటింగ్ 500 మీటర్ల ఈవెంట్‌లో హవర్డ్ లోరెన్డజెన్ 34.41 సెకన్లలో మొదటి స్థానంలో నిలవడంతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. దీంతో ఈ విభాగంలో పసిడి పతకం సాధించిన తొలి నార్వే దేశస్థుడుగా హవర్డ్ లోరెన్డజెన్ చరిత్ర సృష్టించాడు.

అరుదైన ఘనత సాధించిన హవర్డ్ లోరెన్డజెన్

అరుదైన ఘనత సాధించిన హవర్డ్ లోరెన్డజెన్

అంతకముందు 1968లో ఈ విభాగంలో మాగ్నీ థామ్సన్ ఈ విభాగంలో సిల్వర్ పతకాన్ని సాధించాడు. దీంతో 70 ఏళ్ల తర్వాత బంగారు పతకం సాధించిన ఆటగాడిగా హవర్డ్ లోరెన్డజెన్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగేళ్ల క్రితం సోచీలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో 32వ స్థానంలో నిలిచిన హవర్డ్.. ప్యాంగ్ చాంగ్‌లో మాత్రం ఒలింపిక్ రికార్డు నెలకొల్పాడు.

రెండో స్థానంలో దక్షిణకొరియాకు చెందిన చ మిన్ కుయి

రెండో స్థానంలో దక్షిణకొరియాకు చెందిన చ మిన్ కుయి

ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్‌లో నార్వే మొత్తం 14 పతకాలను కైవసం చేసుకుంది. మరోవైపు దక్షిణకొరియాకు చెందిన చ మిన్ కుయి (34.42 సెకన్లు)తో రెండో స్థానంలో నిలవగా, చైనాకు చెందిన గయి టింగ్యు (34.65)తో మూడో స్థానంలో నిలిచాడు. గతంలో స్పీడ్ స్కేటింగ్‌ ఈవెంట్‌లో నార్వే, నెదర్లాండ్స్ దేశాలు పవర్ హౌస్‌లుగా ఉండేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నారు. స్పీడ్ స్కేటింగ్‌లో 1998లో నెదర్లాండ్స్‌కు చెందిన ఆడ్నే స్నోడ్రల్ 1,500 మీటర్లలో సాధించిన పతకమే చివరి బంగారు పతకం కావడం విశేషం.

Story first published: Wednesday, February 21, 2018, 12:49 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X