న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చడి మెతుకులే పోటీలో వెనకబడేలా చేశాయ్: పీటీ ఉషా

Forced to Eat Rice Porridge with Pickle at 1984 Olympics: PT Usha

న్యూఢిల్లీ: అలనాటి పరుగుల రాణి పీటీ ఉష 1984లో లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పతకం చేజారడానికి కారణాలు చెబుతూ ఆవేదనం వ్యక్తం చేశారు.పచ్చడి మెతుకులు తినడం వల్లే తాను ఒలింపిక్స్‌ పతకం తృటిలో కోల్పోయానని తెలిపింది భారత పరుగుల రాణి పీటీ ఉష. 400 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో ప్రతి రౌండ్‌లో అద్భుత ప్రదర్శన ఇస్తూ ఫైనల్స్‌కు వెళ్లారు. 1984లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో ఉష సెకన్ల తేడాతో రజత పతకాన్ని కోల్పోయింది.

మిగతా అథ్లెట్లను చూస్తే చాలా ఈర్ష్యగా ఉండేది

మిగతా అథ్లెట్లను చూస్తే చాలా ఈర్ష్యగా ఉండేది

అందరి క్రీడాకారుల్లా తాను నాణ్యమైన భోజనం దొరక్క పచ్చడి మెతుకులు తినడం వల్ల చివరి సెకండ్లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాను అని ఉష చెప్పింది. తాజాగా ఆమె మాట్లాడుతూ... ‘1984లో లాస్‌ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్‌ పోటీలు జరిగాయి. 400మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్స్‌లో సెకన్ల తేడాతో పతకం కోల్పోయా. చివరి 35 మీటర్లలో నా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆ సమయంలో క్రీడా గ్రామంలో ఉన్న మిగతా అథ్లెట్లను చూస్తే చాలా ఈర్ష్యగా ఉండేది.'

 చికెన్‌ ఆహారంగా తీసుకునే వారు

చికెన్‌ ఆహారంగా తీసుకునే వారు

'వారంతా ఎంతో నాణ్యమైన ఆహానం తీసుకునేవారు. ఉడకబెట్టిన బంగాళదుంపలు, చికెన్‌ తదితర పదార్థాలను ఆహారంగా తీసుకునే వారు. నేను మాత్రం పచ్చడి మెతుకులతో అన్నం తినేదాన్ని. అలాగే ఒక పండు తినేదాన్ని. ఇది నా ప్రదర్శనపై ప్రభావం చూపింది. ఈ కారణంగానే నేను పతకం సాధించలేక. రుమేనియా క్రీడాకారిణి క్రిస్టియానా నేను ఇంచుమించు ఒకే సమయంలో గమ్యాన్ని చేరాము. కానీ, రివ్యూలో మిల్లీ సెకన్ల తేడాతో ఆమె ముందుగా చేరినట్లు ఉంది.'

 సెకన్‌లో వందో వంతు సమయం ముందుగా:

సెకన్‌లో వందో వంతు సమయం ముందుగా:

'సెకన్‌లో వందో వంతు సమయం ముందుగానే క్రిస్టియానా హర్డిల్స్‌ పూర్తి చేసిందని ప్రకటింగానే తీవ్రమైన నిరాశకు లోనయ్యా. దీంతో పతకం నాకు దక్కకుండా పోయింది. నాణ్యమైన ఆహారం తిని ఉంటే నేను తప్పకుండా పతకం సాధించేదాన్ని. ప్రతి అథ్లెట్‌కు ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం' అని ఉష తెలిపారు. ఈ కారణంగా నా ఎనర్జీ లెవల్స్‌ చాలా తగ్గిపోయాయి. తొలి 45 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 6.2 సెకన్లలో పూర్తిచేసి అద్భుతంగా ఆరంభించా. శాయశక్తులా యత్నించినా చివరి 35 మీటర్ల రేసులో కాస్త నెమ్మదించాను.

ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌పై పూర్తిగా దృష్టి

ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌పై పూర్తిగా దృష్టి

ఎందుకంటే తగినంత పోషకాహారం తీసుకోని కారణంగా మూడో స్థానాన్ని సైతం వెంట్రుకవాసిలో కోల్పోయి పతకాన్ని చేజార్చుకున్నానని' లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో జరిగిన అనుభవాలను పీటీ ఉష నెమరువేసుకున్నారు. ప్రస్తుతం ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌పై పూర్తిగా దృష్టిసారించానని చెప్పారు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో మెరుగైన అథ్లెట్లను తయారు చేసి దేశానికి పతకాలు అందించడమే తన లక్ష్యమని పీటీ ఉష వివరించారు.

Story first published: Friday, August 17, 2018, 10:44 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X