న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుష హార్మోన్లు: ద్యుతి చంద్‌‌కి ఊరట

By Nageshwara Rao
Dutee Chand gets CAS relief, allowed to compete for six months

హైదరాబాద్: భారత స్టార్ అథ్లెట్ ద్యుతి చంద్‌కు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)లో మరోసారి ఊరట లభించింది. పురుష హార్మోన్లు (హైపర్ ఆండ్రోగోనిజమ్) ఎక్కువ స్థాయిలో ఉన్న మహిళా అథ్లెట్లు పోటీల్లో పాల్గొనకుండా అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్‌ఐ) తీసుకొచ్చిన వివాదాస్పద నిబంధనను క్రీడల మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) మరో ఆరు నెలలు సస్పెండ్ చేసింది.

తాజా ఉత్తర్వులతో త్వరలో ప్రారంభం కానున్న కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు ద్యుతికి మార్గం సుగమం అయింది. అయితే భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) కఠిన అర్హతా ప్రమాణాలను ఆమె అందుకుంటే ఈ పోటీల్లో పాల్గొనొచ్చు. అంతేకాదు ఈ ఆరు నెలల కాలంలో హైపర్ ఆండ్రోగోనిజమ్ విధానాలను ఎలా ముందుకు తీసుకెళ్లే అంశంలో సీఏఎస్.. ఐఏఏఎఫ్‌కు ఆమె సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.

పురుష హార్మోన్స్ ఎక్కువగా ఉన్నందున మిగతా మహిళా క్రీడాకారుల కంటే ఎక్కువ లబ్ది పొందుతున్న కారణంతో ఐఏఏఎఫ్ 2014లో ద్యుతి చంద్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో ఆమె 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనలేక పోయింది. 2015 జులైలో ఐఏఏఎఫ్‌ నిబంధనలపై సీఏఎస్‌ సస్పెన్షన్‌ విధించడంతో ద్యుతి మళ్లీ ట్రాక్‌పై అడుగుపెట్టింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 20, 2018, 9:19 [IST]
Other articles published on Jan 20, 2018
Read in English: Dutee Chand gets CAS relief
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X