న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మా వల్ల కాదు: కామన్వెల్త్ గేమ్స్‌పై చేతులెత్తేసిన డర్బన్

2022 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కుల్ని దక్కించుకుని, రెండేళ్ల కిందటే సన్నాహాలు కూడా మొదలుపెట్టిన డర్బన్‌ (దక్షిణాఫ్రికా) ఇప్పుడు అనూహ్యంగా చేతులెత్తేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ లాంటి మెగా టోర్నీల నిర్వహణకు వివిధ దేశాలు పోటీ పడేవి. ఈ క్రీడలను నిర్వహించడం ఎంతో గొప్పగా భావించేవి. బిడ్‌ గెలవగానే సంబరాల్లో మునిగిపోయేవి. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడేవి కావు. అయితే ఇటీవల పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది.

సంపన్న దేశాలు సైతం టోర్నీల నిర్వహణకు వెనకడుగు వేస్తున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి అటు ఇటుగా ఉన్న దేశాలైతే ఈ క్రీడల నిర్వహణ మాకొద్దంటూ దండం పెడుతున్నాయి. ఈ క్రీడల నిర్వహణకు ఖర్చు తడిసి మోపెడవడంతో పాటు దేశ ఆర్థిక స్థితిపైనే ప్రభావం చూపుతుండటంతో వెనక్కి తగ్గుతున్నాయి.

2024 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్ వేసిన ఐదు దేశాల్లో ఇప్పటికే మూడు వెనక్కి తగ్గడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా 2022 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కుల్ని దక్కించుకుని, రెండేళ్ల కిందటే సన్నాహాలు కూడా మొదలుపెట్టిన డర్బన్‌ (దక్షిణాఫ్రికా) ఇప్పుడు అనూహ్యంగా చేతులెత్తేసింది.

ఆర్థిక పరిస్థితి నుకూలంగా లేకపోవడం వల్లే

ఆర్థిక పరిస్థితి నుకూలంగా లేకపోవడం వల్లే

ఆర్థిక పరిస్థితి నుకూలంగా లేకపోవడంతో ఆతిథ్య హక్కుల్ని కోల్పోవాల్సి వచ్చింది. కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్యం నుంచి డర్బన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడం, బిడ్ దక్కించుకున్నాక రెండేళ్ల కాల వ్యవధిలో నిర్దేశించిన సన్నాహాలు వేగవంతం చేయలేకపోవడం, బడ్జెట్ కుదిస్తూ ప్రతిపాదించిన కొత్త నమూనాను కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీడబ్ల్యూజీఎఫ్) అంగీకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో డర్బన్ ఆతిథ్య హక్కుల్ని వదులుకుంది.

దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి సైతం

దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి సైతం

తమ వద్ద తగినంత డబ్బులేకే ఆతిథ్య హక్కుల్ని వదులుకోవాల్సి వచ్చిందని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి తెలిపారు. 'మా ప్రయత్నం మేం చేశాం. కానీ మా దగ్గర డబ్బు లేదని మా దేశం చెబుతోంది. అలాంటపుడు క్రీడలు నిర్వహించలేం' అని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి ఇప్పటికే ప్రకటించారు.

సీడబ్ల్యూజీఎఫ్‌ అధికారిక ప్రకటన

సీడబ్ల్యూజీఎఫ్‌ అధికారిక ప్రకటన

దీంతో అన్ని అంశాలు పరిశీలించాక 2022 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కుల్ని డర్బన్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్టు సీడబ్ల్యూజీఎఫ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యాన్ని దక్షిణాఫ్రికా తొలిసారి దక్కించుకోవడంతో దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తమైంది.

సిద్ధమన్న లివర్‌పూల్‌ సిటీ

సిద్ధమన్న లివర్‌పూల్‌ సిటీ

ఎందుకంటే ఆ దేశానికి ఈ క్రీడల ఆతిథ్యం దక్కడం అదే తొలిసారి. 2015లో జరిగిన బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నది డర్బన్‌ ఒక్కటే. కానీ క్రీడల్ని నిర్వహించే అవకాశాన్ని మాత్రం డర్బన్‌ నిలబెట్టుకోలేకపోయింది. నాలుగేళ్లకోసారి వచ్చే కామన్వెల్త్‌ క్రీడల్ని వచ్చే ఏడాది క్వీన్స్‌లాండ్‌ (ఆస్ట్రేలియా)లో నిర్వహించనున్నారు. డర్బన్‌ రేసులోంచి తప్పుకోనున్న నేపథ్యంలో 2022 క్రీడల్ని నిర్వహించడానికి తాము సిద్ధమని లివర్‌పూల్‌ సిటీ (బ్రిటన్‌) పేర్కొంది. 2010లో భారత్‌ కామన్వెల్త్‌ క్రీడలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Durban stripped of 2022 CWG
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X