న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోపింగ్‌లో పట్టుబడ్డ భారత్ క్రీడాకారుడు, ఆసియన్ గేమ్స్‌లో కేటగిరీ లేనట్లే

Doping: Asian Games-bound steeplechase runner Naveen Dagar tests positive for meldonium

హైదరాబాద్: త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌కు సన్నద్ధమవుతున్న భారత అథ్లెట్‌పై సస్పెన్షన్ వేటు విధించారు. ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించిన భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉన్న స్టీపుల్‌చేజ్‌ రన్నర్‌ నవీన్‌ దగార్‌ డోప్‌ పరీక్షల్లో పట్టుబడ్డాడు. 2014 ఆసియా గేమ్స్‌ కాంస్య పతక విజేత అయిన దగార్‌.. గౌహతిలో జరిగిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో ఈ రన్నర్ నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు.

నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ (నాడా) గత నెల 23న నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నిషిద్ధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు రుజువు కావడంతో అతనిపై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) సస్పెన్షన్ వేటు వేసింది. 'దగార్‌ను ఏఎఫ్‌ఐ సస్పెండ్‌ చేసింది. అతడు నిషిద్ధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్లు పరీక్షల్లో తేలింది. దగార్‌ 'బి' నమూనా ఫలితం రావాల్సివుంది' అని సమాఖ్య వర్గాలు తెలిపాయి.

అథ్లెటిక్స్ ఫెడరేషన్‌లో ఇటీవల కాలంలో డోపింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లెట్లు పట్టుబడ్డారు. ఇంతకుముందు జావెలిన్ త్రోయర్ అమిత్ కుమార్ (ఇంటర్ స్టేట్ మీట్‌లో కాంస్య పతక విజేత) డోపిగ్ టెస్టుల్లో పట్టుబడ్డాడు. ఇపుడు తాజాగా నవీన్ దాగర్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి సస్పెన్షన్‌కు గురికావడంతో ఈనెల 18 నుంచి జకార్తా, పాలెంబంగ్‌లో జరిగే 3వేల మీటర్ల పరుగు పందెం పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం లేనట్టే.

అయితే, నవీన్‌కు త్వరలో 'బి' శాంపుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక పరీక్షల్లో మైల్‌డ్రోనేట్ వాడినట్లుగా తెలుస్తోంది. ఈ మందు రక్త సరఫరాని వేగవంతం చేస్తుంది. గుండె, మెదడుకు చేరాల్సిన రక్త సరఫరా గురించి ఉపయోగిస్తారు. అథ్లెట్లు ఎక్కువగా చేసే వర్క్‌లోడ్స్‌కు శారీరక శ్రమ తగ్గించేలా ఇది పనిచేస్తుంది.

Story first published: Friday, August 3, 2018, 12:29 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X