న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశ్వవ్యాప్తం: త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా దీపా కర్మాకర్

By Nageshwara Rao
Dipa Karmakar likely to be named Tripuras brand ambassador

హైదరాబాద్: ప్రముఖ భారత జిమ్నాస్టిక్స్ సంచలనం దీపా కర్మాకర్‌ను త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. గత ఆదివారం టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన ఎఫ్‌ఐజీ వరల్డ్ ఛాలెంజ్ కప్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో దీపా కర్మాకర్ స్వర్ణ పతకాన్ని సాధించింది.

దీంతో త్రిపుర రాష్ట్రం పేరును విశ్వవ్యాప్తం చేసిన దీపా కర్మాకర్‌ను బ్రాండ్ అంబాసిడరుగా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ కాంతిదేబ్ అధికారికంగా ప్రకటించారు. త్రిపుర రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

"దీపా కర్మార్కర్ సక్సెస్‌పై తామెంతో సంతోషంగా ఉన్నాం. త్రిపుర రాష్ట్రం పేరుని విశ్వవ్యాప్తం చేసింది. కాబట్టి దీపా కర్మాకర్‌ను త్రిపుర బ్రాండ్ అంబాసిడరుగా నియమిస్తున్నాం. దీపా కర్మార్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి వర్గంతోపాటు ముఖ్యమంత్రికి ప్రతిపాదన చేశాం" అని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

దాదాపు గాయం కారణంగా రెండేళ్ల పాటు జిమ్నాస్టిక్స్‌కి దూరమైన దీపా కర్మార్కర్ తిరిగి ఇటీవలే ఓ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొంది. గాయం తర్వాత తాను పాల్గొన్న తొలి టోర్నీలోనే అదరగొట్టింది. ఫైనల్లో దీపా కర్మాకర్ 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది.

ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్‌ వరల్డ్‌కప్ జిమ్మాస్టిక్స్ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా విన్యాసంతో జిమ్నాస్టిక్స్‌ ప్రపంచాన్ని అబ్బురపరిచి పతకానికి చేరువగా వచ్చిన దీప.. ఆ తర్వాత మోకాలి గాయం కారణంగా దాదాపు రెండేళ్లు ఆటకు దూరమైంది.

Story first published: Saturday, July 14, 2018, 13:10 [IST]
Other articles published on Jul 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X