న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్.. టోక్యో నిర్వహణపై 3 నెలల్లో తుది నిర్ణయం!!

Dick Pound says 3 months for Tokyo Olympics to decide fate given coronavirus fears


టోక్యో:
చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్ ప్రభావం త్వరలో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో జరగనున్న 2020 ఒలింపిక్స్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లే కనబడుతోంది. ఇప్పటికే కరోనాతో ఒలింపిక్స్‌ నిర్వహణపై పలు సందేహాలు నెలకొన్నాయి. అయితే.. టోక్యో నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరో మూడు నెలలు వేచి చూస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సీనియర్‌ సభ్యుడు డిక్‌ పౌండ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

'కోహ్లీ, రోహిత్‌లకు వీరాభిమానిని.. అయినా వాళ్లిద్దరి వికెట్లు తీస్తా''కోహ్లీ, రోహిత్‌లకు వీరాభిమానిని.. అయినా వాళ్లిద్దరి వికెట్లు తీస్తా'

డిక్‌ పౌండ్‌ మాట్లాడుతూ... 'ఒలింపిక్స్‌కు ఏర్పాట్లు చేసేందుకు క్రీడల ఆరంభం తేదీకి ముందు రెండు నెలల సమయం చాలు. ఒలింపిక్స్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. కొవిడ్‌ వైరస్‌పై ఈ మూడు నెలల్లోగా మరింత స్పష్టత వస్తుంది. అప్పుడే టోక్యో నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ సమయంలో కొవిడ్ అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నాం. ఆటగాళ్లు తమ క్రీడలపై దృష్టి పెట్టండి. టోక్యో ఒలింపిక్స్‌ తప్పకుండా జరుగుతాయని భావిస్తున్నా' అని తెలిపారు.

కొవిడ్ ప్రబలిన నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహించాలా లేదా అనే విషయాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని డిక్‌ పౌండ్‌ పేర్కొన్నారు. మరోవైపు కొవిడ్ వ్యాపిస్తున్నందున ఈ వేసవిలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం చాలా ప్రమాదకరమని రుజువైతే క్రీడలను పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందట. ఒలింపిక్స్ వాయిదా వేయడం, లేదా మరో ప్రాంతానికి తరలించడం కంటే పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. ఏదేమైనా మరో మూడు నెలల్లోగా మరింత స్పష్టత రానుంది.

కొవిడ్‌ కారణంగా తాజాగా చైనాలో 71 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,715కి చేరింది. చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ ఈ వైరస్‌ కలవరపెడుతోంది. దక్షిణ కొరియా, మధ్య తూర్పు దేశాలు, ఐరోపా ఖండంలో ప్రబలింది. కొవిడ్ వల్ల జపాన్ దేశంలోనే నలుగురు మరణించారు. ఇక దక్షిణ కొరియాలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 1000కి చేరగా.. మృతుల సంఖ్య 10గా ఉంది. దీంతో ఈ దేశంలోని బుసాన్‌ నగరంలో మార్చి 22 నుంచి జరగాల్సిన ప్రపంచ టీమ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు వాయిదా పడ్డాయి.

షెడ్యూల్ ప్రకారం జపాన్‌లోని టోక్యో నగరంలో జులై 24న ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ఆగస్టు 25న నుంచే పారాలింపిక్స్‌ ఆరంభం కానున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 11,000 మంది అథ్లెట్లు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు.

Story first published: Wednesday, February 26, 2020, 12:39 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X