ఆనందంతో క్లార్స్, ఆవేదనగా వెట్టోరి: ఈ కప్‌లో రిటైరైన దిగ్గజాలు వీరే

By Srinivas

మెల్బోర్న్: ప్రపంచ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు ఈ ట్రోఫీని గత ఏడాది మృతి చెందిన ఫిలిప్ హ్యూస్‌కు అంకితం ఇచ్చింది. కాగా, ఈ టోర్నీతో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఒకరు కప్ గెలిచిన ఆనందంతో, మరొకరు ఆవేదనతో గుడ్ బై చెప్పారు.

న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెట్టోరి అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్ వన్డేల నుండి వైదొలిగాడు. ఈ ప్రపంచ కప్ గెలిచి.. క్లార్క్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆసిస్, వెటోరీని ఆనందంగా పంపించాలని కివీస్ భావించాయి. చివరకు క్లార్క్ ఆనందంతో వన్డేలకు గుడ్ బై చెప్పాడు.

18 ఏళ్ల పాటు న్యూజిలాండ్ క్రికెట్‌కు సేవలు అందించిన వెట్టోరీ అన్ని ఫార్మాట్ల నుండి వైదొలిగాడు. 18 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆల్ రౌండర్. 113 టెస్టులు ఆడి 4531 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 362 వికెట్లు పడగొట్టాడు.

295 వన్డేలు ఆడి 2551 పరుగులు చేశాడు. సెంచరీలు మాత్రం లేవు. నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. 305 వికెట్లు తీశాడు. 34 టీ 20లు ఆడి 205 పరుగులు చేశాడు. 38 వికెట్లు పడగొట్టాడు. ఆసిస్ సారథి క్లార్క్.. 245 వన్డేలు ఆడి 8 సెంచరీలు చేశాడు. 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 7981 పరుగులు చేశాడు. 108 టెస్టులు ఆడి 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేశాడు. 8432 పరుగులు చేశాడు.

కాగా, ఈ ప్రపంచ కప్‌లోనే దిగ్గజాలైన కుమార సంగక్కర (శ్రీలంక), మహేల జయవర్ధనే (శ్రీలంక), మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్), అఫ్రీది (పాకిస్తాన్), బ్రెండన్ టేలర్ (జింబాబ్వే)లు రిటైర్మెంట్ ప్రకటించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X