షూటింగ్ లో మరో స్వర్ణాన్ని సాధించిన భారత క్రీడాకారిణి

Posted By:
CWG 2018: Heena Sidhu wins gold in 25M Pistol

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్‌లోనూ భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మంగళవారం జరిగిన పోటీల్లో 25మీటర్ల విభాగంలో హీనా సిద్ధు
స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ఉదయం నుంచి జరిగిన పోటీల్లో కామన్వెల్త్‌లో ఏడు సార్లు పతకం గెలుచుకున్న గగన్ నారంగ్ 50మీటర్ల విభాగంలో నిరుత్సాహపరిచాడు. ఆ బాధను హీనా సిద్ధు స్వర్ణంతో తుడిచి పెట్టేసింది.

ఈమెతో పాటుగా 25మీటర్ల విభాగంలో పాల్గొన్న మరో క్రీడాకారిణి అన్ను సింగ్ కూడా ఓటమికి గురైంది. ఇదే పోటీలో 25మీ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా గలియాబోవిచ్ వెండి పతకాన్ని సాధించగా, మలేసియాకు చెందిన అలియా సజానా అజహరి బ్రాంజ్ తో సరిపెట్టుకుంది.

పిస్టల్ విభాగంలో ప్రపంచ మాజీ నెంబర్ వన్ అయిన హీనా కామన్వెల్త్ గేమ్స్ లో ఎలాగైనా స్వర్ణన్ని గెలుచుకోవాలని ప్రాక్టీస్ అయిందట. ఎందుకంటే ఆసియన్ గేమ్ప్, ఒలింపిక్స్ గేమ్స్ లో అర్హత సాధించేందుకు ఇదే కీలకమని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ట్రైనింగ్ పరంగా చెప్పాలంటే అత్యద్భుతంగా జరిగిందనే చెప్పాలి. ప్రపంచ ఛాంపియన్‌ఫిప్‌లో పాల్గొనాలంటే ఆ మాత్రం పోటీ ఉంటుంది కదా' అని తెలిపింది.

గతంలో వ్యక్తిగతంగా పాల్గొన్న హీనా సిద్ధు 10మీటర్ల విభాగంలో కామన్వెల్త్‌లో, ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని, బ్రాంజ్ ను సొంతం చేసుకుంది. హీనా కామన్వెల్త్ లో 2010లో పాల్గొని స్వర్ణాన్ని, 2014లో సిల్వర్‌ను గెలుచుకుంది.

Story first published: Tuesday, April 10, 2018, 12:29 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి