న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games 2022: పంచ్‌లతో ప్రత్యర్థికి దడ పుట్టించిన అమిత్ పంఘల్.. బాక్సింగ్లో గోల్డ్ కైవసం

Commonwealth games : Amit Panghal Harsh Punches to Opponent and Won Gold Medal In Boxing

కామన్‌వెల్త్ గేమ్స్‌ బాక్సింగ్‌లో పురుషుల 51కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘల్ స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకున్న పంఘల్ ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఇంగ్లాండ్‌కు చెందిన కియారన్ మెక్‌డొనాల్డ్‌తో జరిగిన ఫైనల్‌లో సత్తా చాటి గెలుపొందాడు. స్థానిక బాక్సర్‌కి ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున చీర్స్ లభించినప్పటికీ.. అమిత్ పంఘల్ తన A గేమ్‌లోనే తన ల్యాండింగ్ కనబర్చాడు. మెక్‌డొనాల్డ్ తన హైట్‌ను ఉపయోగించుకోలేకపోయాడు.

ఏకగ్రీవంగా గెలుపు

దీంతో పంచ్‌లతో చెలరేగిన అమిత్ పంఘల్ 5-0తో ఏకగ్రీవంగా గెలుపొందాడు. అతను మొదటి రెండు రౌండ్‌లలోనే ప్రత్యర్థిపై భారీ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో చివరి రౌండ్‌లో ఆడుతూ పాడుతున్నట్లు పంచ్‌లతో దడ పుట్టించాడు. ఇకపోతే అమిత్ తన తొలి కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం గెలిచిన తర్వాత ఆనందంతో గాల్లోకి పంచ్ విసిరాడు. కేవలం 5అడుగుల 2ఇంచుల ఎత్తు మాత్రమే ఉన్న పంఘల్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న తొలి మరియు ఏకైక భారతీయ మెన్స్ బాక్సర్.

వ్యవసాయ కుటుంబంలో పుట్టి..

హర్యానాలోని రోహ్‌తక్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పంఘల్.. బాక్సర్‌గా మారడానికి తన అన్నయ్య అజయ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. పంఘల్ లైట్ ఫ్లైవెయిట్ 49కేజీల విభాగంలో బాక్సర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. 2017ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ప్రతిభ కనబరిచి కాంస్యాన్ని సాధించాడు. అదే అతనికి తొలి ప్రధాన ఈవెంట్ పతకం. దీని తరువాత అతను 2018లో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ఆసియా గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో పతక ఆశలు

టోక్యో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమిత్ రౌండ్ ఆఫ్ 16లో ఓడిపోయాడు. అయితే బర్మింగ్‌హామ్‌లోని కామన్ వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించడం వల్ల అతను 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో భారత్‌కు పతక ఆశలు రేకెత్తిస్తున్నాడు. ఇకపోతే తాజా కామన్ వెల్త్ గేమ్స్‌లో మెన్స్ 51కేజీల ఫ్లైవెయిట్ సెమీఫైనల్‌లో టోక్యో-2020 ఒలింపియన్‌గా ఉన్న జాంబియన్ పాట్రిక్ చినియెంబాను ఏకగ్రీవ నిర్ణయంతో ఓడించి ఫైనల్ చేరుకున్నాడు. 2018 గోల్డ్ కోస్ట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న పంఘల్‌కి ఇది వరుసగా రెండో కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ కావడం విశేషం.

Story first published: Sunday, August 7, 2022, 16:40 [IST]
Other articles published on Aug 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X