న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా స్వర్ణం సాధించిన వేళ నేలరాలిన జాతీయ జెండాలు

By Nageshwara Rao
china,japan flags off Chinese gold rush at Asian Games

జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా 18వ ఆసియా గేమ్స్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. పతకాల కోసం అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతున్నారు. సోమవారం నాటికి పతకాల పట్టికలో చైనా 19 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, 15 పతకాలతో జపాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

పోటీల్లో భాగంగా ఆదివారం టోర్నీలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చైనా, జపాన్ దేశాలకు చెందిన జెండాలు కింద పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని చేత్తో పట్టుకుని నిల్చున్నారు. వివరాల్లోకి వెళితే పోటీల్లో భాగంగా ఆదివారం పురుషుల 200మీటర్ల స్విమ్మంగ్‌ ఫైనల్‌ పోటీలు జరిగాయి.

china,japan flags off Chinese gold rush at Asian Games

చైనా, జపాన్‌ క్రీడాకారులు పతకాలను సొంతం చేసుకున్నారు. చైనాకు చెందిన సున్‌ యాంగ్‌ స్వర్ణం గెలుచుకోగా, జపాన్‌కు చెందిన మత్సుమోటో, ఇంజి జీ (జపాన్‌) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోటీలు ముగిసిన అనంతరం యథావిధిగా నిర్వాహకులు ఆటగాళ్లకు మెడల్స్ ప్రజెంటేషన్‌ను నిర్వహించారు.

ఇందులో భాగంగానే ఆటగాళ్ల దేశాలకు సంబంధించిన జెండాలను సమీపంలో ఎగురవేసి స్వర్ణ నెగ్గిన క్రీడాకారుడి దేశానికి చెందిన జాతీయ గీతం ఆలపిస్తారు. ఈ సమయంలోనే అక్కడ ఓ పొరబాటు దొర్లింది. చైనా జాతీయ గీతం ప్రారంభంకాగానే ప్రమాదవశాత్తూ ఆ మూడు జెండాలు కింద పడిపోయాయి.

Story first published: Monday, August 20, 2018, 13:59 [IST]
Other articles published on Aug 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X