వింటర్ ఒలింపిక్స్: అంతటి చలిలోనూ వేడి పుట్టించిన రొమాంటిక్ జంట (వీడియో)

Posted By: Subhan
Canadian figure skating duo


హైదరాబాద్: 2018 జనవరిలో కెనడియన్ స్కేటింగ్ నేషనల్స్‌కు హాజరైన జంట వింటర్ ఒలింపిక్స్ వేడుకలలో రెచ్చిపోయింది. ఇప్పటికే మూడు సార్లు వింటర్ ఒలింపిక్స్ విజేత అయిన జంట మరోసారి పతకం కోసం పోటీ పడింది. ఇందులో కెనడా జట్టు స్వర్ణాన్ని గెలిచింది.

వింటర్ ఒలింపిక్స్ అనగానే మనకు గుర్తొచ్చే ప్రధాన క్రీడ స్కేటింగ్. ఈ స్కేటింగ్‌లో మరో కొత్త ప్రక్రియ స్కేటింగ్ డ్యూయో. ఇప్పటికే రెండు సార్లు స్వర్ణాన్ని కైవసం చేసుకున్న జట్టు మూడో సారి కూడా నమోదు చేసుకుంది. రెగ్యూలర్ ఫీట్‌లను పక్కకు పెట్టి ఓ రిస్క్ ఫీట్‌ను చేసింది. ఈ భంగిమకు చూసిన వాళ్లందరూ కాసేపటి వరకూ రెప్పవేయడం మర్చిపోయేంతగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది.

మోయిర్, స్కాట్‌ల జోడి చూపరుల దృష్టిని మారనీకుండా చేసింది. ఎగిరి అతనిపై దూకిన ఆమె అతని భుజాలపై క్షణకాలం పాటు కూర్చొని వెంటనే తిరిగి గిరగిరమంటూ నేల మీదకు దిగింది. అంతటి వేగంలోనూ వారి కళ్లలో భావాన్ని ఏ మాత్రం చెదరనీకుండా ప్రదర్శించారు.

23వ వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తున్నారు.

వింటర్ ఒలింపిక్స్‌కు ప్యాంగ్‌ చాంగ్‌తో కలిపి ఆతిథ్యమిస్తున్న గాంగ్‌న్యూంగ్‌లో సోమవారం జరిగిన ఫిగర్ స్కేటింగ్ టీం చాంపియన్‌షిప్‌ను కెనడా గెల్చుకుంది. ఈ జట్టులో పాట్రిక్ చాన్, కేట్లీ నొమాన్డ్, గాబ్రియెల్ డేల్మన్, మెగాన్ డహామెల్/ ఎరిక్ రాడ్‌ఫోర్డ్, టెస్సా వర్ట్యూ/ స్కాట్ మోయిర్ సభ్యులుగా ఉన్నారు. కాగా, డోపింగ్ కేసుల కారణంగా రష్యా సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటుండగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పతాకంపై పోటీ చేస్తున్న ఆ దేశ ఫిగర్ స్కేటింగ్‌లో రజత పతకం లభించింది. కాంస్య పతకాన్ని రష్యా జట్టు అందుకుంది.

డహిమెయర్‌కు డబుల్
మహిళల బయథ్లాన్‌లో జర్మనీకి చెందిన లారా డహిమెయర్ రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇంతకు ముందు స్ప్రింట్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన ఆమె సోమవారం నాటి పర్య్సూట్‌లోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంది. 30:35.3 నిమిషాల్లో ఆమె లక్ష్యాన్ని పూర్తి చేయగా, స్లోవేకియా స్టార్ అనస్టాసియా కుజ్మినా 31:04.7 నిమిషాలతో రజత పతకాన్ని అందుకుంది. అనైస్ బెస్కార్డ్ (ఫ్రాన్స్)కు కాంస్య పతకం లభించింది. కాగా, పురుషుల పర్య్సూట్‌లో మార్టిన్ ఫోర్కేడ్ (ఫ్రాన్స్) 32:51.7 నిమిషాలతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. సెబాస్టియన్ శామ్యూల్సన్ (స్వీడన్/ 33:03.7 నిమిషాలు), బెనెడిట్ డాల్ (జర్మనీ/ 33.06.8 నిమిషాలు) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.

ఈ గేమ్స్‌లో ఐస్ హాకీ, ఆల్పైన స్కీయింగ్, బయోథ్లాన్, బాబ్ స్లీగీ, క్రాస్ కంట్రీ స్కీయింగ్, కర్లింగ్, ఫిగర్ స్కేటింగ్, ఫ్రీ స్టయిల్ స్కేటింగ్, లూగే, నోరాడిక్ కంబైన్డ్, స్పీడ్ స్కేటింగ్, స్కెలిటన్, స్కీజంపింగ్, స్నోబోర్డింగ్ ఉన్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే ఈ వింటర్ ఒలింపిక్స్‌లో 92 దేశాలకు చెందిన 3వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 12, 2018, 17:00 [IST]
Other articles published on Feb 12, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి