న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'పురుషులతో సమానంగా మహిళకు వేతనాలు ఇవ్వాలి'

BBC survey: More Indians says female athletes should be paid the same amount as male

న్యూఢిల్లీ: పురుష అథ్లెట్లతో సమానంగా మహిళా అథ్లెట్లకు జీతాలివ్వాలని ఎక్కువ మంది భారతీయులు అభిప్రాయపడ్డట్టు బీబీసీ అధ్యయనంలో తేలింది. పురుష అథ్లెట్లతో సమానంగా మహిళకు జీతాలివ్వాలని ఎక్కువ మంది అభిప్రాయపడగా.. 38 మంది శాతం మంది మాత్రం మహిళల ఆటలు పురుషుల ఆటల్లా వినోదాన్ని పంచవని బీబీసీ సర్వేలో తేలింది. భారత దేశంలోని 14 రాష్ట్రాల్లో 10,181 మంది అభిప్రాయాలను బీబీసీ సేకరించింది.

ఇప్పటికే నిరూపించాడు.. ప్రపంచంలో కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌: విండీస్ దిగ్గజంఇప్పటికే నిరూపించాడు.. ప్రపంచంలో కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌: విండీస్ దిగ్గజం

ఇటీవలే దేశంలోని 14 రాష్ట్రాల్లో 10,181 మంది అభిప్రాయాలను బీబీసీ సేకరించింది. జీవితంలో క్రీడలు ఎంతో అవసరమని సర్వే చేసిన వారిలో 75 శాతం మంది అభిప్రాయపడినా.. 36 శాతం మంది మాత్రమే ఏదో ఒక ఆట లేదా శారీరక వ్యాయామాల్లో పాల్గొంటున్నట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇక క్రీడల పట్ల పురుషులు 42 శాతం ఆసక్తిని ప్రదర్శించగా.. మహిళలు 29 శాతం మాత్రమే ఉన్నారు.

ప్రతిభలో పురుష అథ్లెట్లకు మహిళా అథ్లెట్లు తీసిపోరని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. మూడో వంతు మంది మాత్రం మహిళా క్రీడాకారులు.. పురుషులంత సమర్థులు కారని చెప్పారు. ఆటలాడడానికి కావాల్సినంత దృఢత్వం మహిళల్లో ఉండదని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు.

దేశంలో 15 శాతం మంది మహిళలు, 25 శాతం మంది పురుషులు క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే కబడ్డీలో మాత్రం ఈ వ్యత్యాసం తక్కువ. 15 శాతం మంది పురుషులు, 11 శాతం మంది మహిళలు కబడ్డీ ఆడుతున్నారు. బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, కబడ్డీ లాంటి ఆటలు అమ్మాయిలకు అంతగా సరిపడవని.. క్రికెట్‌ ఆడే పురుషులు, మహిళల్లో ఎంతో అంతరం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.

Story first published: Monday, March 23, 2020, 11:27 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X