న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిస్టర్ వరల్డ్ 2018గా భారతీయుడు: ఎవరీ గోలాప్ రభా

 Assams Golap Rabha crowned Mr World 2018, makes India proud

హైదరాబాద్: అస్సాంకు చెందిన గోలాప్ రభా భారత్‌ గర్వించేలా చేశాడు. మిస్టర్ వరల్డ్ 2018 పోటీల్లో విజేతగా నిలిచాడు. లూథియానా వేదికగా వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్(డబ్ల్యు‌ఎఫ్ఎఫ్)-వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్(డబ్ల్యుబిబిఎఫ్) సంయక్తంగా నిర్వహించిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో ట్రోఫీని గెలుచుకున్నాడు.

కోహ్లీ కాకుంటే టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు అర్హులు వీరేకోహ్లీ కాకుంటే టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు అర్హులు వీరే

టెలిగ్రాఫ్‌లో వచ్చిన కథనం ప్రకారం 35 ఏళ్ల గోలాప్ రభా తాను పాల్గొన్న మూడు విభాగాల్లో(పురుషుల ప్రో వరల్డ్ బాడీ బిల్డింగ్, పురుషుల మస్కల్ మోడల్, ప్రో మిస్టర్ వరల్డ్) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గోలాప్ రభా మాట్లాడుతూ "అంతర్జాతీయ స్టేజిపై వరల్డ్ క్లాస్ బాడీ బిల్డర్లతో తలపడటం చాలా అమేజింగ్‌గా ఉంది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే విదేశీయులు భారత్‌లో ట్రైనింగ్ కోసం మన ఫోటోలు, ఫోన్ నెంబర్లు అడుగుతుడటమే" అని అన్నాడు.

2003లో బాడీ బిల్డింగ్‌ను కెరీర్‌గా

2003లో గోలాప్ రభా ఈ బాడీ బిల్డింగ్‌ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నాడు. అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలోని బోకోకు చెందిన జితిన్ కలిత వద్ద బాడీ బిల్డింగ్‌లో శిక్షణ పొందాడు. తన సొంత గ్రామమైన బోకోలో రభా జిమ్ నిర్వహించడంతో పాటు రోజుకు ఆరు గంటల పాటు శిక్షణ పొందేవాడు.

2008లో రభా జూనియర్ మిస్టర్ అస్సాంగా గోలాప్ రభా

2008లో రభా జూనియర్ మిస్టర్ అస్సాం, జూనియర్ మిస్టర్ కామ్‌రూప్ టైటిళ్లను గెలిచాడు. ఆ తర్వాత మిస్టర్ ఇండియా 2017, మిస్టర్ ఇండియా 2018 టైటిళ్ల తోపాటు మిస్టర్ ఆసియా 2018 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గోలాప్ రభా కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది.

రభా భార్య ఇషా శర్మ రభా మాట్లాడుతూ

రభా భార్య ఇషా శర్మ రభా మాట్లాడుతూ

రభా భార్య ఇషా శర్మ రభా మాట్లాడుతూ "రాత్రి 11 గంటల సమయం... తుది ఫలితం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఎప్పుడైతే ఆ వార్త తెలిసిందో నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఆనందంలో నా కుమార్తెను మనసుకు హత్తుకున్నాను" అని ఆమె తెలిపారు.

 అస్సాం ముఖ్యమంత్రి ప్రశంసలు

అస్సాం ముఖ్యమంత్రి ప్రశంసలు

మిస్టర్ వరల్డ్ 2018గా ఎంపికైన గోలాప్ రభాపై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. రభా వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్(డబ్ల్యు‌ఎఫ్ఎఫ్)-వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్(డబ్ల్యుబిబిఎఫ్) టైటిల్ గెలవడంతో అస్సాంలో బాడీ బిల్డింగ్‌ను ఓ క్రీడగా ప్రమోట్ చేసేందుకు అవకాశం లభించిందని తెలిపారు.

Story first published: Friday, October 26, 2018, 17:24 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X