న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్లు: చైనా గోడను దాటారు

భారత అథ్లెటిక్స్‌ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సరికొత్త చరిత్ర సృష్టించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత అథ్లెటిక్స్‌ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయం. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో గత టోర్నీల కన్నా మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆదివారం భారత అథ్లెట్లు మరో ఐదు బంగారు పతకాలను కైవసం చేసుకోవడంతో భారత్‌ (12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలు) మొత్తం 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 1985లో జకార్తాలో జరిగిన టోర్నీలో అత్యధికంగా నెగ్గిన 22 పతకాల రికార్డును అధిగమించింది.

1983 నుంచి 2015 వరకూ వరుసగా 17 పర్యాయాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనా రికార్డుని భారత్ అధిగమించింది. ఆగస్టులో లండన్‌లో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ను దృష్టిలో ఉంచుకొని ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన చైనా ఎనిమిది స్వర్ణాలకే పరిమితమైంది.

డబుల్ సాధించిన లక్ష్మణన్‌ గోవిందన్‌

డబుల్ సాధించిన లక్ష్మణన్‌ గోవిందన్‌

మొత్తంగా 20 పతకాలతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. కజకిస్థాన్‌ (4 స్వర్ణ, 2 రజత, 2 కాంస్యం) 8 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. టోర్నీలో ఆఖరి రోజైన ఆదివారం లక్ష్మణన్‌ గోవిందన్‌.. 10 వేల మీటర్ల ఈవెంట్లోనూ పసిడి గెలిచి ‘డబుల్‌' సాధించాడు. అంతకముందు పురుషుల 5 వేల మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచాడు.

చివరి రోజు భారత్‌కు తొలి స్వర్ణం అందించిన స్వప్నా బర్మన్‌

చివరి రోజు భారత్‌కు తొలి స్వర్ణం అందించిన స్వప్నా బర్మన్‌

చివరి రోజైన ఆదివారం జరిగిన మహిళల హెప్టాథ్లాన్‌లో స్వప్నా బర్మన్‌ భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. ఇదే ఈవెంట్‌లో పూర్ణిమా హెంబ్రమ్‌ కాంస్యం సాధించింది. రెండు రోజుల పాటు మొత్తం ఏడు అంశాల్లో (100 మీటర్ల హర్డిల్స్‌, హై జంప్‌, షాట్‌పుట్‌, 200 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, జావెలిన్‌ త్రో, 800 మీటర్ల పరు గు) జరిగిన ఈ ఈవెంట్‌లో 5942 పాయింట్లతో బర్మన్‌ అగ్రస్థానంలో నిలవగా.. పూర్ణిమ 5798 పాయింట్లతో మూడో స్థానం సాధించింది.

జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా

జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా

లక్ష్మణన్‌ గోవిందన్‌ 29:55.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఇదే పోటీలో గోపి తొనకాల్‌ (29:58.89 సె) రజతం గెలుచుకున్నాడు. జావెలిన్‌ త్రోలో యువ సంచలనం నీరజ్‌ చోప్రా పసిడి గెలిచాడు. అతను జావెలిన్‌ను 85.23 మీటర్ల దూరం విసిరి కొత్త మీట్‌ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు.

4×400 మీ పరుగులో పతకాలు సాధించిన పురుషులు

4×400 మీ పరుగులో పతకాలు సాధించిన పురుషులు

ఇదే పోటీలో దేవేందర్‌సింగ్‌ (83.29 మీ) కాంస్యం సాధించాడు. ఇక 4×400 మీ పరుగులో పురుషులు, మహిళల విభాగాల్లో భారత్‌ స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. కుంజు మహ్మద్‌, అమోజ్‌ జాకబ్‌, మహమ్మద్‌ అనాస్‌, రాజీవ్‌ అరోకియాతో కూడిన పురుషుల జట్టు 3 నిమిషాల 02.92 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానం సాధించింది.

4×400 మీ పరుగులో పతకాలు సాధించిన మహిళలు

4×400 మీ పరుగులో పతకాలు సాధించిన మహిళలు

టోర్నీకి ఆఖరిదైన మహిళల రిలేను దెబాశ్రీ మజుందార్‌, ఎమ్‌.ఆర్‌. పూవమ్మ, జిస్నా మాథ్యూ, నిర్మలతో కూడిన భారత్‌ 3 నిమిషాల 31.34 సెకన్లలో ముగించి స్వర్ణం కైవసం చేసుకుంది. బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల స్వప్న చివరి రేసు ముగిశాక ట్రాక్‌పై సొమ్మసిల్లి పడిపోగా.. ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించారు.

అర్చనా అధావ్‌పై అనర్హత వేటు

అర్చనా అధావ్‌పై అనర్హత వేటు

మహిళల 800 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌ అర్చనా అధావ్‌పై అనర్హత వేటు పడకుంటే మన ఖాతాలో మరో పసిడి చేరేది. అర్చన.. రేసులో తమను కావాలనే అడ్డుకుందని శ్రీలంక అమ్మాయిలు ఫిర్యాదు చేయడంతో వీడియోను వీక్షించిన అధికారులు ఆమెను దోషిగా తేల్చారు. అర్చన నుంచి స్వర్ణం వెనక్కి తీసుకుని.. నిమిలి వళివర్ష (2:05.23 ని, శ్రీలంక), గయంతిక తుషారి (2:05.27 ని, శ్రీలంక)లకు స్వర్ణ, రజత పతకాలు ప్రకటించారు.

రెండో ల్యాప్‌లోనే వైదొలిగిన టింటు లుకా

రెండో ల్యాప్‌లోనే వైదొలిగిన టింటు లుకా

అయితే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టింటు లుకా గాయం కారణంగా రెండో ల్యాప్‌లోనే వైదొలిగింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో అథ్లెట్లు ఒకరివెనుక మరొకరు పతకాలు తెస్తుంటే ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: AAC: India top medals tally
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X