ప్రముఖ జిమ్నాస్ట్, అరుణారెడ్డి కోచ్ ఇకలేరు

Posted By:
Aruna’s coach Brij Kishore passes away

హైదరాబాద్: 'శాట్స్‌' జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఎన్‌. బ్రిజ్‌ కిశోర్‌ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
జిమ్నాస్ట్‌లో దేశానికి తొలి రజత పతకం అందించిన అరుణారెడ్డి కోచ్ కూడా బ్రిజ్ కిశోర్ కావడం గమనార్హం. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు.

1993లో శాట్స్‌లో కోచ్‌గా చేరిన బ్రిజ్‌కిశోర్‌ ఎంతో మంది జాతీయ స్థాయి జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దారు. ఇటీవల జరిగిన జిమ్నాస్టిక్స్‌ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన బుద్ధా అరుణా రెడ్డి కూడా ఆయన శిష్యురాలే. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం రూ.25లక్షల నజరానాను అందించిన విషయం తెలిసిందే.

బ్రిజ్‌ కిషోర్‌ మృతి పట్ల క్రీడల మంత్రి పద్మారావు, క్రీడల కార్యదర్శి వెంకటేశం, శాట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, శాట్స్‌ ఎండీ దినకర్‌బాబు, ఒలింపిక్‌ అసోసియేష్‌ ఆఫ్‌ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్‌, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌, శాట్స్‌ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం అధ్యక్షురాలు సత్యవాణి సంతాపం తెలిపారు.

Story first published: Friday, April 6, 2018, 10:04 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి