వింటర్ ఒలింపిక్స్: బాబోయ్... 'ఇక ఫైనల్లో ఆడలేం'

Posted By: Subhan
Aimee Fuller feared for her safety during snowboard final

హైదరాబాద్: ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లిన క్రీడాకారులకు గెలవాలన్న కసి ఇంకా ఎక్కువ ఉంటుంది. భయపడితే ప్రత్యర్థి ఎత్తుగడల కోసం, లేదా తనలోని నైపుణ్యం గురించి బాధపడుతుంటారు. ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. వాతావరణం చూసి క్రీడాకారులు గడగడ వణికిపోతున్నారు. బాబోయ్.. ఇప్పటి దాకా ఏదో రకంగా అయిపోయింది. కానీ, ఫైనల్‌లో ఎలా ఉంటుందో పరిస్థితి అని ఆడకముందే హడలిపోతున్నారు.

మరిన్ని వింటర్ ఒలింపిక్స్ వార్తల కోసం

ఫైనల్లో గెలిచిన అమీ ఫులర్‌ (బ్రిటన్‌)తో పాటు మరో ఇద్దరికి గాయాలు గట్టిగానే తగిలాయి. -15 డిగ్రీల ఉష్ణోగ్రతలో, భీకర గాలుల మధ్య ఫైనల్‌ నిర్వహంచడంపై అథ్లెట్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అల్‌పైన్‌ స్కీయింగ్‌ ఈవెంట్‌ మరోసారి వాయిదా పడింది. మున్ముందు వాతావరణ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారేందుకు ఆస్కారమున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి క్రీడలను ముగించాలనే ఉద్దేశంతో ఉన్న నిర్వాహకులు ఈవెంట్లను వాయిదా వేసేందుకు అంగీకరించట్లేదు.

కానీ ఇంతటి ప్రతికూల వాతావరణంలో ఆడడం చాలా కష్టమని.. తాము క్షేమంగా ఉండటానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అథ్లెట్లు అంటున్నారు. ''ఇలాంటి వాతావరణంలో స్నో బోర్డింగ్‌ ఫైనల్‌ ఎలా నిర్వహించారో తెలియట్లేదు. గాయం కాకుండా పోటీని ముగించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఈవెంట్‌ను రద్దు చేయాలి.. లేదా వాయిదా వేయాలి'' అని ఈ పోటీల్లో కాంస్యం గెలిచిన ఫిన్లాండ్‌ అథ్లెట్‌ రుకాజార్‌ చెప్పింది.

శీతాకాల ఒలింపిక్స్‌ పోటీలు క్రీడాకారులకు సవాలు విసరుగుతున్నాయి. విపరీతమైన గాలులు, అంతమించిన చలితో క్లిష్టంగా మారిన వాతావరణంతో అథ్లెట్లు బెదిరిపోతున్నారు. వాతావరణం సహకరించకపోవడంతో చాలా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. కొన్ని ఈవెంట్లలో అయితే అథ్లెట్లు పోటీపడటానికే భయపడుతున్నారు.

పతకాల సంగతి దేవుడెరుగు.. ప్రాణాలు మిగిలితే చాలు అంటున్నారు. మహిళల స్నో బోర్డింగ్‌లో ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొదట క్వాలిఫయింగ్‌లో చాలామందికి గాయాలు కాగా.. ఫైనల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. చలి గాలుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొంతమంది అథ్లెట్లు పోటీల మధ్యలోనే పడిపోయి గాయాల పాలయ్యారు. కొందరు ప్రమాదకరంగా మంచు గడ్డలను ఢీకొన్నారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 10:21 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి