న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రమోషన్ అదిరింది: రోడ్డుపైకి 65 వేల మంది ఇండోనేషియన్లు (వీడియో)

By Nageshwara Rao
65000 indonesians go loco for poco-poco in asian games record attempt

హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఆసియా గేమ్స్‌కు ఇండోనేషియా రాజధాని జకార్తా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాజధాని జకార్తా, పాలెంబంగ్‌లలో ఈ ఆసియా గేమ్స్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది.

అయితే, క్రికెట్‌‌కు వరల్డ్ కప్, ఒలింపిక్స్, కామన్వెల్త్‌ గేమ్స్, ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ లాగే నాలుగేళ్లకోసారి ఈ ఆసియా గేమ్స్ జరుగుతుంటాయి. ఆసియా గేమ్స్ ఓ ఖండానికే పరిమితమైనప్పటికీ ఈ గేమ్స్‌లో మొత్తం 45 దేశాలు పాల్గొంటాయి. దీంతో ఒలింపిక్స్‌ స్థాయి ఉన్న ఈవెంట్‌‌గా దీనిని పరిగణిస్తుంటారు.

ఆసియా గేమ్స్‌లోనే క్రీడాంశాలు ఎక్కువ

ఆసియా గేమ్స్‌లోనే క్రీడాంశాలు ఎక్కువ

కామన్వెల్త్‌ క్రీడల్లో ఇంతకంటే ఎక్కువ (71) దేశాలు పాల్గొంటునప్పటికీ, క్రీడాంశాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఆసియా క్రీడల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం జరగబోయే ఆసియా గేమ్స్‌లో 45 దేశాలు పాల్గొననున్నాయి. మొత్తం 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగనున్నాయి.

ఆగస్టు 18 నుంచి సెప్టంబర్ 2 వరకు

ఈసారి పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్‌ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఆసియా గేమ్స్ నేపథ్యంలో ఈ రెండు నగరాలను అందంగా అలంకరిస్తున్నారు. మరోవైపు ఆసియన్ గేమ్స్‌ను ప్రమోట్ చేసేందుకు ఇండోనేషియన్లు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు.

అతిపెద్ద సామూహిక డ్యాన్స్‌గా గిన్నిస్ రికార్డు

ఆదివారం 65 వేల మంది ఇండోనేషియన్లు తెల్లని దుస్తులు ధరించి ఒక్కసారిగా జకార్తా వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు జోకో విడోడో కూడా వారితో జతకలిశారు. అందరూ కలిసి ఇండోనేషియా సాంప్రదాయ నృత్యం ‘పోకో-పోకో' డ్యాన్స్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక డ్యాన్స్‌గా ఇది గిన్నిస్ రికార్డు సృష్టించింది.

అందరినీ ఆకర్షించిన పోకో-పోకో డ్యాన్స్‌

ఈ ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరినీ ఆకర్షించింది. కాగా, అదే సమయంలో దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న 1.20 లక్షల మందికిపైగా ఖైదీలు కూడా డ్యాన్స్ చేయడం విశేషం. పోకో-పోకో డ్యాన్స్‌తో తమకు ప్రపంచ గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా ఇండోనేషియన్లు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం.

Story first published: Wednesday, August 8, 2018, 13:58 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X