న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 సూపర్ ట్యాకిల్స్‌తో విజయాన్నందుకున్న తెలుగు టైటాన్స్

Six Super Tackles by their defence help Telugu Titans clinch thriller

విశాఖపట్నం: సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు అదరగొడుతోంది.. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన అంతర్‌ జోన్‌ మ్యాచ్‌లో టైటాన్స్‌ 35-31 తేడాతో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. ఆదివారం ఇంటర్‌జోన్ ఛాలెంజ్ వీక్‌లో భాగంగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35-31 తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరీ(10) రాణించగా, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్(6) ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

9-8తో ఆధిక్యంలో ఉన్నపుడు టైటాన్స్‌ సూపర్‌ ట్యాకిల్‌ చేసి ఆధిక్యాన్ని పెంచుకుంది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరీ మెరుపు రైడింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ పాయింట్లు కొల్లగొట్టాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సరికి టైటాన్స్ 20-13తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కీలకమైన ద్వితీయార్ధంలో హర్యానా పుంజుకోవడంతో పాయింట్ల మధ్య అంతరం పెరిగింది.

విరామం తర్వాత కూడా అదే దూకుడుతో ఆడిన టైటాన్స్‌ మ్యాచ్‌ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా 29-19తో నిలిచింది. సులభంగానే గెలిచేలా కనిపించింది. కానీ అప్పుడే అసలు డ్రామా మొదలైంది. హర్యానా జట్టులో స్టార్ రైడర్ మోను గోయత్(11), కుల్దీప్‌సింగ్(3) రాణించారు. మోను గోయత్‌ (12) వరుసగా పాయింట్లు తేవడంతో హరియాణా 30-30తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత సూపర్‌ ట్యాకిల్‌ సాధించిన టైటాన్స్‌ 32-30తో ఆధిక్యంలోకి వెళ్లింది.

వెంటనే హరియాణా పాయింట్‌ సాధించి ఆధిక్యాన్ని తగ్గించింది. మరోవైపు చివరి రైడ్‌ డూ ఆర్‌ డై కావడంతో మ్యాచ్‌ టైగా ముగుస్తుందేమో అనుకున్నారు. కానీ నీలేశ్‌ సూపర్‌ రైడ్‌తో 3 పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు. ఈ విజయంతో జోన్‌-బిలో మూడో స్థానానికి చేరుకున్న టైటాన్స్‌ ప్లేఆఫ్‌ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఆఖర్లో హోరాహోరీని తలపించింది. చివరి రైడింగ్‌లో నీలేశ్ సాలుంకే మూడు పాయింట్లతో టైటాన్స్ ఉత్కంఠ విజయాన్నందుకుంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 37-24తో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.

Story first published: Monday, December 10, 2018, 11:00 [IST]
Other articles published on Dec 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X