న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపక్‌ హుడా మెరుపులు.. ఉత్కంఠ పోరులో హరియాణా, జైపూర్‌ మ్యాచ్ టై

PKL 2019: Deepak Hooda’s heroics undone by Haryana Steelers’ defence as both teams settle for a tie

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ జోరు కొనసాగిస్తోంది. బుధవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, హరియాణా స్టీలర్స్‌ మ్యాచ్‌ 32-32తో టైగా ముగిసింది. జైపూర్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ నివాస్‌ హుడా 14 పాయింట్లతో అదరగొట్టాడు. హరియాణా తరపున రవి కుమార్ సునీల్ హై-5లు నమోదు చేయగా.. వికాస్ ఖండాల, ప్రశాంత్ కుమార్ రైడింగ్లో మెరిశారు.

పాక్ మంత్రి ఆరోపణలు అబద్దం.. లంక ఆటగాళ్లపై భారత్‌ ఒత్తిడి లేదు!!పాక్ మంత్రి ఆరోపణలు అబద్దం.. లంక ఆటగాళ్లపై భారత్‌ ఒత్తిడి లేదు!!

మ్యాచ్ ఆరంభం నుండే ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం శ్రమించారు. పోటాపోటీగా తలపడడంతో మ్యాచ్ ఆరంభం నుండే రసవత్తరంగా సాగింది. తొలి ఎనమిది మినిషాలు పూర్తయ్యేసరికి ఇరు జట్ల స్కోర్ 6-6తో సమం అయింది. ఈ సమయంలో జైపూర్ ఆధిపత్యం కొనసాగించింది. హరియాణాను తొలి ఆలౌట్ చేసిన జైపూర్ 13-7తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో హరియాణా రైడర్ వికాస్ రెచ్చిపోవడంతో జైపూర్ ఆలౌట్ అవ్వడంతో తొలి అర్ధ భాగాన్ని 18-14తో ముగించింది.

విరామం అనంతరం కూడా హరియాణా జోరు కోయినసాగించింది. దీపక్‌ చెలరేగడంతో అనూహ్యంగా పుంజుకున్న జైపూర్ 28-29తో హరియాణా స్కోరును సమీపించింది. అదే ఊపులో 32-30తో ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరి నిమిషంలో హరియాణా రెండు పాయింట్లు సాదించడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 29-26తో మాజీ ఛాంపియన్ యు ముంబా పై విజయం సాధించింది. వారియర్స్ తరఫున సుఖేశ్ హెగ్డే 8, మణిందర్ 7 పాయింట్లు సాధించారు. ముంబా తరపున అర్జున్ దేశ్వాల్ (15 పాయింట్లు) సూపర్-10తో మెరిసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

Story first published: Thursday, September 12, 2019, 9:19 [IST]
Other articles published on Sep 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X