ప్రో కబడ్డీ: సత్తాచాటిన రాహుల్, తెలుగు టైటాన్స్‌కు రెండో విజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రాహుల్ చౌదరి మరోసారి మెరుపులు మెరిపించడంతో శనివారం తెలుగు టైటాన్స్ 34-29తో యూపీ యోధను ఓడించింది. శనివారం జోన్ 'బి'లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాహుల్ ఆరంభంలో విజృంభించడంతో టైటాన్స్ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత యూపీ 7-8తో టైటాన్స్‌కు గట్టిపోటీ ఇచ్చింది. రాహుల్ అదే జోరు కొనసాగించడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి టైటాన్స్ 18-13తో ఆధిక్యంలో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో యూపి యోధ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. రిషాంక్ డబుల్ రైడ్ పాయింట్లు సాధించడంతో ఆ జట్టు 16-21తో ప్రత్యర్థిని సమీపించింది.
మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా
మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. ప్రశాంత్ కుమార్ సూపర్ ట్యాకిల్ చేయడంతో యోధ 25-30తో మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచింది. అయితే 39వ నిమిషంలో అబ్‌జోర్ సూపర్ ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ 31-26తో విజయానికి చేరువైంది. చివర్లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి మరో సూపర్ రైడ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
9 పాయింట్లు సాధించిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి
తెలుగు టైటాన్స్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగారు. డిఫెన్స్‌లో అబోజర్ మిఘాని 6 టాక్లింగ్ పాయింట్లతో హైఫైవ్ సాధించాడు. ఇక, యూపీ యోధ తరఫున ప్రశాంత్ రాయ్ (11 పాయింట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగినా జట్టును గెలిపించలేకపోయాడు.
డిఫెన్స్‌లో తెలుగు టైటాన్స్ మెరుగ్గా రాణించింది
రైడింగ్‌లో ఇరు జట్లూ సమవుజ్జీలుగా నిలిచినా.. డిఫెన్స్‌లో తెలుగు టైటాన్స్ మెరుగ్గా రాణించి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 53-26తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా... హరియాణా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు.

మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌పై యు ముంబా విజయం
రైడింగ్, డిఫెన్స్‌లోనూ ముంబా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా.. డిఫెన్స్‌లో ఫజల్ అత్రాచెలి 7 టాక్లింగ్ పాయింట్లతో అదరగొట్టాడు. ప్రో కబడ్డీలో ఆదివారం నాడు పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, హరియాణా స్టీలర్స్‌తో పుణేరి పల్టన్ జట్లు తలపడనున్నాయి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications