న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జున అవార్డుపై సంతోషం: 35వ కబడ్డీ ప్లేయర్‌గా అజయ్ ఠాకూర్

India kabaddi legend Ajay Thakur bestowed with the Arjuna Award

హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ అన్నాడు. హాక్ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు 29ని ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అజయ్ ఠాకూర్ అర్జున అవార్డుని అందుకున్నాడు. ఈ ఏడాది అజయ్ ఠాకూర్‌కు ఇది రెండో కేంద్ర పురస్కారం కావడం విశేషం. జనవరిలో పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.

జమైకాలో రవిశాస్త్రి నోటి వెంట పాట: ఎవరీ బాబ్ మార్లే (వీడియో)జమైకాలో రవిశాస్త్రి నోటి వెంట పాట: ఎవరీ బాబ్ మార్లే (వీడియో)

అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ

అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ

అర్జున అవార్డు పురస్కారంతో తనను సత్కరించడంపై అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ "చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకు చాలా ముఖ్యమైనది. ఎవరైనా ఒక క్రీడాకారుడు తన వృత్తిని ప్రారంభించినప్పుడు, అతను తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల కంటాడు. నేను గత 15 సంవత్సరాలుగా భారత జట్టుతో ఉన్నాను. ఏదో ఒక రోజు నేను దాన్ని పొందగలననే ఆశతో.. ఈ అవార్డు కోసం ఎప్పటినుంచో ఆడుతున్నాను" అని అన్నాడు.

35వ కబడ్డీ ఆటగాడిగా

ఈ క్రమంలో అర్జున అవార్డు అందుకున్న 35వ కబడ్డీ ఆటగాడిగా అజయ్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించాడు. అజయ్ ఠాకూర్‌కు ముందు ఈ అవార్డుని అనుప్ కుమార్, రాకేశ్ కుమార్, జస్వీర్ సింగ్, నవనీత్ గౌతమ్ అందుకున్నారు. వీరితో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్ కోచ్ రామ్ మెహర్ సింగ్, బెంగాల్ వారియర్స్ కోచ్ బీసీ రమేశ్, బెంగళూరు బుల్స్ కోచ్ రణవీర్ సింగ్ షెరావత్ గతంలో ‌అర్జున అవార్డు అందుకున్న జాబితాలో ఉన్నారు.

అజయ్ ఠాకూర్‌తో పాటు మరో 18 మంది

అజయ్ ఠాకూర్‌తో పాటు మరో 18 మంది

కాగా, 2018 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్‌తో పాటు మరో 18 మందిని అర్జున అవార్డుతో సత్కరించింది. గత పదిహేను సంవత్సరాలుగా కబడ్డీ ఆడుతున్న ఆజయ్ ఠాకూర్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఠాకూర్‌ నేతృత్వంలో 2016 కబడ్డీ ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఠాకూర్‌ ఉత్తమ రైడర్ అవార్డును అందుకున్నాడు.

800 పాయింట్ల సాధించిన ఠాకూర్

800 పాయింట్ల సాధించిన ఠాకూర్

2018లో అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని టీమిండియా దుబాయి మాస్టర్స్‌తో పాటు ఆసియా గేమ్స్‌ను కైవసం చేసుకుంది. ఒకవైపు జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ.. మరోవైపు ప్రొ కబడ్డీలో తమిళ్‌ తలైవాస్‌ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. ప్రో కబడ్డీలో పర్దీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హుడాలతో పాటు 800 పాయింట్లను సాధించిన నలుగురు ఆటగాళ్లలో అజయ్ ఠాకూర్ ఒకడు.

Story first published: Friday, August 30, 2019, 16:42 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X