న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దక్షిణ కొరియా పర్యటనకు కెప్టెన్‌గా రాణి రాంపాల్

By Nageshwara Rao
Rani named skipper for South Korea tour

హైదరాబాద్: దక్షిణ కొరియా పర్యటనకు భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 20 మంది జట్టు సభ్యులతో కూడిన భారత మహిళా హాకీ జట్టుకి కెప్టెన్‌గా రాణి రాంపాల్‌ను ఎంపిక చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆతిత్య దక్షిణ కొరియాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ ఐదు మ్యాచ్‌లు మార్చి 3 నుంచి 12 వరకు జిన్‌చున్ జాతీయ అథ్లెటిక్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ జట్టు ఎంపిక చేయడానికి ముందు స్పోర్ట్ ఆథారిటి ఆఫ్ ఇండియా (శాయ్) నేతృత్వంలో మొత్తం 34 మంది సభ్యులతో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో చివరకు 20 మందిని ఎంపిక చేశారు.

ఈ పర్యటనలో డిఫెండర్ సునీతా లక్రా వైస్ కెప్టెన్‌గా వ్వవహారించనుంది. సీనియర్ గోల్ కీపర్ సవితకు ఈ పర్యటనలో విశ్రాంతి కల్పించారు. ఆమె స్థానంలో రజని ఇతిమరపు, స్వాతిలకు చోటు కల్పించారు. ఇక, డిఫెన్స్ విభాగం విషయానికి వస్తే దీపిక, సుమన్ దేవి, దీప్ గ్రేస్ ఎక్కా, సుశీల్ చాను, గుర్జీత్ కౌర్‌లతో బలంగా ఉంది.

మిడ్ ఫీల్డర్లుగా మౌనిక, నమిత తొప్పో, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, ఉదిత, లిలిమ మిన్జ్‌ జట్టుని నడిపించనున్నారు. గతేడాది నవంబర్‌లో ఆసియా కప్ విజయం తర్వాత భారత మహిళల జట్టు పర్యటిస్తోన్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఆసియా కప్ ఫైనల్లో చైనాపై పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 5-4తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దక్షిణకొరియా పర్యటనకు భారత మహిళల హాకీ జట్టు:
గోల్ కీపర్లు: రజనీ ఎతిమరుపు, స్వాతి

డిఫెండర్స్: దీపిక, సునీతా లక్రా (వైస్ కెప్టెన్), దీప్ గ్రేస్ ఎక్కా, సుమన్ దేవి తౌదమ్, గుర్జిత్ కౌర్, సుశీల చాను

మిడ్ ఫీల్డర్: మోనిక, నామిత తొప్రో, నిక్కి ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మిన్జ్, ఉదిత

ఫార్వర్డ్స్: రాణి (కెప్టెన్), వందనా కటరియ, లాల్ర్ స్మియామియా, నవజోత్ కౌర్, నవనీత్ కౌర్, పూనమ్ రాణి.

Story first published: Thursday, July 19, 2018, 13:06 [IST]
Other articles published on Jul 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X