న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hockey World Cup Opening Ceremony: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలి

Odisha Hockey World Cup: When And Where To Watch Opening Ceremony Featuring AR Rahman, Shah Rukh Khan, Madhuri Dixit

హైదరాబాద్: భారత్ ఆతిథ్యమిస్తోన్న హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ వరల్డ్‌కప్‌కు మంగళవారం తెరలేవనుంది. 19 రోజుల పాటు జరిగే టోర్నీలో 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 36 మ్యాచుల్లో తలపడనున్నాయి.

<strong>భువనేశ్వర్‌లో హాకీ వరల్డ్‌కప్: భారత్ పునర్‌వైభవం తెచ్చేనా?, ఫేవరెట్‌ జట్లివే</strong>భువనేశ్వర్‌లో హాకీ వరల్డ్‌కప్: భారత్ పునర్‌వైభవం తెచ్చేనా?, ఫేవరెట్‌ జట్లివే

తొలి రోజైన మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు మాత్రమే జరుగుతుండగా.... బుధవారం నుంచి అసలు సమరానికి తెరలేవనుంది. హాకీ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవ నేపథ్యంలో భువనేశ్వర్‌లో విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 1.30 వరకే పని చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.

వరల్డ్‌కప్‌కు మూడోసారి ఆతిథ్యమిస్తోన్న భారత్‌

హాకీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. తొలిసారిగా 1994లో ముంబయి వేదికగా జరిగిన టోర్నీలో భారత్‌ ఐదోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 2010 ఢిల్లీ వేదికగా ఎనిమిదోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ తారలు కనువిందు చేయబోతున్నారు.

కళింగ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుక్, సల్మాన్‌

కళింగ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుక్, సల్మాన్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లు షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్‌, మాధురీ దీక్షిత్‌ తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించబోతున్నారు. మంగళవారం కళింగ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుక్ ఖాన్, మాధురి దీక్షిత్‌లు తమ డ్యాన్స్‌తో అలరించనున్నారు.

నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు

నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు

ఇక, బుధవారం బారాబతి స్టేడియంలో జరిగే వరల్డ్‌కప్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ సందడి చేయనున్నాడు. ఈ రెండు ఈవెంట్లలో సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఈ హాకీ వరల్డ్‌కప్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు 19 రోజుల పాటు జరగనుంది.

హాకీ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి:

హాకీ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి:

* తేదీ: నవంబర్ 27 (గురువారం)

* సమయం: సాయంత్రం 5:30 గంటలకు

* వేదిక: కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిషా

టీవీ గైడ్: స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, దూరదర్శన్

ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్: International Hockey Federation (FIH) official YouTube Channel, Hotstar

Story first published: Tuesday, November 27, 2018, 13:10 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X