న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండో హాఫ్‌లో గేమ్ ప్లాన్ మార్చాం: బెల్జియంతో మ్యాచ్ డ్రాపై కోచ్

 Hockey World Cup 2018: India coach Harendra Singh says change of structure, game plan at half-time worked against Belgium

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5-0తేడాతో విజయం సాధించి టోర్నమెంట్‌లో శుభారంభం చేసిన భారత హాకీ జట్టు ఆదివారం బెల్జియంతో జరిగిన రెండో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.

పార్టీ ప్రచారంలో సెహ్వాగ్?: సిగ్గుండాలి.. ఇంత దిగజారుతారా!! పార్టీ ప్రచారంలో సెహ్వాగ్?: సిగ్గుండాలి.. ఇంత దిగజారుతారా!!

అయితే, రెండో అర్ధభాగంలో ప్రణాళికను మార్చడంతో పాటు ప్రేక్షకుల మద్దతు లభించడంతోనే మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగిందని టీమిండియా కోచ్‌ హరేంద్ర సింగ్ అన్నారు. కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ "మొదటి క్వార్టర్‌లోనే బెల్జియం గోల్‌ సాధించడం మాకేం ఆశ్చర్యం కలిగించలేదు. ముందే దీని గురించి మాట్లాడుకున్నాం" అని అన్నారు.

రెండో అర్ధభాగంలో ప్రణాళికను మార్చాం

రెండో అర్ధభాగంలో ప్రణాళికను మార్చాం

"మ్యాచ్‌ జరుగుతున్న కొద్దీ భారత జట్టు విజృంభిస్తుందని వారికీ తెలుసు. రెండో అర్ధభాగంలో ప్రణాళికను మార్చాం. ఆటగాళ్లు వాటిని సరిగ్గా అమలు చేశారు.‌ ప్రేక్షకుల మద్దతు కలిసొచ్చింది" అని అన్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత పేలవ ఆటతీరుతో నిరాశపరిచిన భారత్ జట్టు.. మధ్యలో నుంచి అనూహ్యంగా పుంజుకుని 2-2తో స్కోరుని సమం చేసింది.

పూల్‌ సీలో అగ్రస్థానంలో భారత జట్టు

పూల్‌ సీలో అగ్రస్థానంలో భారత జట్టు

దీంతో పూల్‌ సీలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. బెల్జియం, భారత జట్లు‌ రెండు మ్యాచ్‌లాడగా నాలుగు పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. అయినప్పటికీ గోల్స్‌లో తేడాతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌ని భారత జట్టు శనివారం కెనడాతో భారత్ తలపడనుంది.

2-2తో డ్రాగా ముగిసిన భారత్-బెల్జియం మ్యాచ్

2-2తో డ్రాగా ముగిసిన భారత్-బెల్జియం మ్యాచ్

హోరాహోరీగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ చివరికి 2-2తో డ్రాగా ముగిసింది. డిఫెన్స్‌, అటాకింగ్‌ ఎంతో బలంగా ఉన్న బెల్జియం జట్టును భారత్‌ ధీటుగా ఎదుర్కొంది. 8వ నిమిషంలోనే హెండ్రిక్స్‌, గోల్‌ చేసి బెల్జియం ఖాతాను తెరిచాడు. భారత్‌ చివరి నిమిషంలో మెరుపు గోల్స్‌ చేయడంతో మ్యాచ్‌ డ్రా గా ముగిసింది.

56వ నిమిషంలో రెండో గోల్‌ చేసిన బెల్జియం ఆటగాడు

56వ నిమిషంలో రెండో గోల్‌ చేసిన బెల్జియం ఆటగాడు

మూడో, నాలుగో క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్‌, సిమ్రన్‌జీత్‌ సింగ్‌ అద్భుతంగా రాణించారు. హర్మన్‌ప్రీత్‌ 39వ నిమిషంలో, సిమ్రన్‌జీత్‌ 47వ నిమిషంలో గోల్స్‌ చేశారు. అప్పటి వరకు భారత్‌ 2-1 తేడాతో ముందజలో ఉండింది. 56వ నిమిషంలో బెల్జియం ఆటగాడు సిమన్‌ రెండో గోల్‌ వేయడంతో స్కోరు సమం అయ్యింది.

Story first published: Tuesday, December 4, 2018, 12:46 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X