న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరేళ్లలో ఆరుగురు: హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్రసింగ్‌పై వేటు

Harendra Singh removed as head coach of senior hockey team, offered junior coach job

హైదరాబాద్: ఎన్ని విమర్శలు వచ్చినా హాకీ ఇండియా (హెచ్‌ఐ) తీరు మాత్రం మారడం లేదు. కోచ్‌లను మార్చే విషయంలో తన తీరు మారదని మరోమారు స్పష్టం చేసింది. తాజాగా భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌ హరేంద్ర సింగ్‌పై వేటు వేసింది. ఈ మేరకు హాకీ ఇండియా బుధవారం అధికారిక ప్రకటన చేసింది.

పీబీఎల్ 2018: సింధు విజయంతో.. సైనా ఓటమితో ముగించారుపీబీఎల్ 2018: సింధు విజయంతో.. సైనా ఓటమితో ముగించారు

గతేడాది మే నెలలో భారత హాకీ జట్టు సీనియర్ కోచ్ హరేంద్ర సింగ్‌ పదవీబాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడి ఆధ్వర్యంలో 2018లో భారత్‌ నిరాశాజనక ఫలితాలు సాధించడంతో హరేంద్రను తప్పిస్తూ హాకీ ఇండియా (హెచ్‌ఐ) బుధవారం నిర్ణయం తీసుకుంది. అతడిని జూనియర్‌ జట్టు కోచ్‌ బాధ్యతలు చేపట్టాల్సిందిగా సూచించింది.

జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు

జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు

‘‘2018లో జట్టు ప్రదర్శన ఆశాజనకంగా లేదు. త్వరలోనే సీనియర్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం. ఆ నియామక ప్రక్రియ ముగిసే వరకు హై పర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ జాన్‌, సహాయక కోచ్‌ క్రిస్‌ జట్టు బాధ్యతలు చూస్తారు. మార్చి నుంచి జూనియర్‌ పురుషుల జట్టు శిక్షణ శిబిరం ఆరంభం కానున్న నేపథ్యంలో ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాలని హరేంద్రను కోరాం'' అని హాకీ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్

2018 ఏడాదిలో భారత హాకీ జట్టు కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించలేకపోయింది. ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి కాంస్యంతో సరిపెట్టుకుంది. భువనేశ్వర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. దీంతో పాటు 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమైంది.

గత ఆరేళ్లలో కోచ్‌పై వేటు వేయడం ఆరోసారి

గత ఆరేళ్లలో కోచ్‌పై వేటు వేయడం ఆరోసారి

దీంతో సీనియర్ జట్టు కోచ్ పదవినుంచి హరేంద్రను తప్పించాలని కమిటీ నిర్ణయించింది. జూనియర్‌ కోచ్‌గా జట్టుకు 2016 వరల్డ్ కప్‌ను అందించిన హరేంద్ర సింగ్ గతేడాది మేలో సీనియర్‌ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఏడు నెలల్లోనే కోచ్‌ను తప్పించడంలో హాకీ ఇండియాపై విమర్శలు వస్తున్నాయి. హాకీ ఇండియా గత ఆరేళ్లలో ఇలా కోచ్‌పై వేటు వేయడం ఇది ఆరోసారి.

Story first published: Thursday, January 10, 2019, 11:36 [IST]
Other articles published on Jan 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X