న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ: బెల్జియం భారత్‌ను హాక్(ఈ) చేసింది

 Four Nations Invitational Hockey: India's midfield, forward line guilty of sluggish display in defeat against Belgium

హైదరాబాద్: భారత జాతీయ క్రీడైనటువంటి హాకీ పోటీలో భారత్‌కు నిరుత్సాహం ఎదురైంది. నాలుగు దేశాల హాకీ టోర్నీలో భాగంగా భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో జపాన్‌ను చిత్తు చేసిన భారత హాకీ జట్టుకు రెండో మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది.

గురువారం బెల్జియం చేతిలో 0-2తో పరాజయంపాలైంది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత్‌కు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టులో సెబాస్టియన్‌ (8వ నిమిషంలో), విక్టర్‌ వెగ్నేజ్‌ (34వ నిమిషంలో) చెరో గోల్‌ సాధించారు. మ్యాచ్‌లో బెల్జియం ఆటగాళ్లు పదేపదే భారత డిఫెన్స్‌లోకి దూసుకొచ్చారు.

12వ నిమిషంలో భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను రమన్‌దీప్‌ సింగ్‌ వృథా చేశాడు. ద్వితీయార్ధంలోనూ వచ్చిన అవకాశాలను భారత్‌ అందుకోలేకపోయింది. రెండో అర్ధభాగం తొలి నిమిషంలోనే భారత్‌కు మూడో పెనాల్టీ కార్నర్‌ లభించడంతో స్కోరు సమం చేసే అవకాశం వచ్చింది. అయితే వరుణ్‌కుమార్‌ కొట్టిన బంతిని ప్రత్యర్థి డిఫెండర్‌ అడ్డుకోవడంతో నిరాశే మిగిలింది.

ఆ తర్వాత భారత్‌ గోల్‌ చేయడానికి చాలా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివర్లో భారత్‌కు మరో పెనాల్టీకార్నర్‌ లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒకరోజు విరామం తీసుకుని మూడో జట్టుతో శనివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 9:34 [IST]
Other articles published on Jan 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X