న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విమర్శలకు చెక్: హాకీ సెలక్షన్ కమిటీలో సర్దార్‌ సింగ్‌కు చోటు

Former captain Sardar Singh named in selection committee of Hockey India

హైదరాబాద్: భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కి అరుదైన అవకాశం లభించింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సర్దార్ సింగ్‌‌కు హాకీ ఇండియా సెలక్షన్ కమిటీలో చోటు కల్పిస్తూ హాకీ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా 1975 హాకీ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని సభ్యుడు బీపీ గోవింద ఉన్నారు.

<strong>బేషరతు క్షమాపణ చెప్పినా సరే... హార్దిక్‌ పాండ్యాకు మరో షాక్‌</strong>బేషరతు క్షమాపణ చెప్పినా సరే... హార్దిక్‌ పాండ్యాకు మరో షాక్‌

మొత్తం 13 మంది ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ జట్టులో కొనసాగుతానని రిటైర్మెంట్‌కి కొద్దిరోజులు ముందు చెప్పిన సర్దార్ సింగ్.. ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత అనూహ్యంగా కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హాకీ ఇండియాపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

సర్దార్‌ సింగ్‌పై ఒత్తిడి పెంచి రిటైర్మెంట్ ప్రకటించేలా చేశారని భారత హాకీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో సర్దార్ సింగ్‌కు సముచిత స్థానం ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో సర్దార్ సింగ్ మాట్లాడుతూ "హాకీ ఇండియా సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా నాకు ఆఫర్ వచ్చింది. సంతోషంగా ఒప్పుకున్నాను" అని అన్నాడు.

"ఇది నాకు ఓ ఛాలెంజ్.. ఎల్లప్పుడూ భారత్‌లో హాకీకి సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాను. ఇన్నేళ్లు.. ఒక ఆటగాడిగా జట్టులో ఆడాను. ఇప్పుడు సెలక్టర్‌గా టీమ్‌ కోసం పనిచేయబోతున్నా" అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, January 16, 2019, 14:59 [IST]
Other articles published on Jan 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X