న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఆసియా కప్ 2022: ఖతార్‌తో కలిసి Group Eలో ఇండియా

World Cup 2022 Asian Qualifiers: India in Group E with Qatar


హైదరాబాద్: 2022లో జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌కు ఖతార్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా క్వాలిఫయిర్స్ రెండో రౌండ్‌లో డ్రా తీయగా ఇండియా.. ఖతారో కలిసి గ్రూప్ ఇలో చోటు దక్కించుకుంది. ఇదే గ్రూపులో ఓమన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు సైతం ఉన్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జూన్‌లో ప్రకటించిన ఫిఫా వరల్డ్ ర్యాంకుల ప్రకారం రౌండ్ 1 విజేతలుగా నిలిచిన బంగ్లాదేశ్, కంబోడియా, గువామ్, మలేషియా, మంగోలియా, శ్రీలంక జట్లు రౌండ్ 2లోకి ప్రవేశించాయి. దీంతో ఈ మెగా టోర్నీలో పాల్గొనే 34 ఆసియా దేశాలను ఎనిమిది గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపులో ఐదు జట్లను ఉంచారు.

రౌండ్ 2 మ్యాచ్‌లు సెప్టెంబర్ 5, 2019 నుంచి జూన్ 9, 2020 వరకు జరగనున్నాయి. గ్రూప్ విన్నర్స్‌తో పాటు నాలుగు బెస్ట్ రన్నరప్స్(మొత్తం 12 జట్లు) తదుపరి రౌండ్‌ అయిన ఆసియా వరల్డ్‌కప్ క్వాలిఫియింగ్‌కు అర్హత సాధిస్తాయి. అంతేకాదు ఈ 12 జట్లు 2023 ఆసియా కప్‌కు అర్హత సాధిస్తాయి.



గ్రూపు స్టేజి వివరాలు:
గ్రూప్ ఎ: చైనా పిఆర్, సిరియా, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, గువామ్
గ్రూప్ బి: ఆస్ట్రేలియా, జోర్డాన్, చైనీస్ తైపీ, కువైట్, నేపాల్
గ్రూప్ సి: ఐఆర్ ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, హాంకాంగ్, కంబోడియా
గ్రూప్ డి: సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, పాలస్తీనా, యెమెన్, సింగపూర్
గ్రూప్ ఇ: బంగ్లాదేశ్, ఒమన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్
గ్రూప్ ఎఫ్: జపాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, మయన్మార్, మంగోలియా
గ్రూప్ జి: యుఎఇ, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా
గ్రూప్ హెచ్: కొరియా రిపబ్లిక్, లెబనాన్, కొరియా డిపిఆర్, తుర్క్మెనిస్తాన్, శ్రీలంక

Story first published: Wednesday, July 17, 2019, 17:26 [IST]
Other articles published on Jul 17, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X