న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రొనాల్డొ భుజంతోనూ గోల్ చేయగలడు..! (వీడియో)

Watch Ronaldo show off with shoulder goal in Juventus training

హైదరాబాద్: ఈ మధ్యనే కొత్త జట్టులోకి మారిన క్రిస్టియన్ రొనాల్డొ ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. అంతేకాదు నూతన సహచరుల ముందు తన సత్తాను చాటేస్తున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డ్. ఈ మధ్యే రియల్ మాడ్రిడ్ నుంచి జువెంటస్ క్లబ్‌కు మారాడు. అందుకోసం ఆ క్లబ్ క్రిస్టియానో 11.7 కోట్ల డాలర్ల( రూ. 800 కోట్లు)కు సమర్పించింది. ఫిఫా వరల్డ్ కప్ అనంతరం పోర్చుగల్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ప్రపంచ కప్‌లో తమ జట్టు వైఫల్యానికి గురికావడంతో జట్టు ఇంటి ముఖం పట్టింది. ఆ తర్వాత కొంత కాలం విరామం తీసుకుని మళ్లీ ఈ మధ్యనే ఫుట్‌బాల్‌కు సిద్ధమైపోయాడు. ఈ క్రమంలో కొత్త క్లబ్ జ్యూవెంటస్ తమ జట్టు వినొవో మైదానంలో మంగళవారం ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందులో తన అనుభవాన్ని ప్రదర్శించిన రొనాల్డొ భుజంతోనే గోల్ చేసి చూపించాడు. మిగిలిన ఆటగాళ్లంతా తమతమ స్టైల్‌లో గోల్ చేస్తుండగా వీడియోను చిత్రీకరించి జ్యూవెంటస్ క్లబ్ ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. ఇదే క్లబ్‌కు సంబంధించి అనుబంధ సంస్థ కార్ల తయారీ సంస్థ ఇటీవల కార్మికులు దాడి చేశారు.

కేవలం రొనాల్డొకే అంత భారీ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అవసరమేముంది. అతనికి చెల్లించిన రూ.800 కోట్లతో ఎన్నో వేల కుటుంబాలు బాగుపడతాయంటూ ధర్నాకు దిగినా ప్రయోజనం లేకుండాపోయింది. యాజమాన్యం వారి నినాదాలను ఖాతరు చేయకపోవడంతో తిరిగి విధుల్లోకి చేరిపోయారు. ఈ ప్రాక్టీసు విషయానికొస్తే రొనాల్డొ స్ట్రైక్ చేసిన బాల్‌ను నెట్‌పై పోల్‌కు టార్గెట్ చేసి అది తిరిగి వస్తుండగా భుజానికి అడ్డుపెట్టి ఆ తర్వాత నెట్‌లోకి గోల్ చేశాడు.

సరదాగా అనిపిస్తోన్న ఇదో కొత్త టెక్నిక్. కొంచెం కష్టంతో కూడుకుంది కూడా. ప్రత్యర్థి ఆటగాళ్లంతా కాళ్లని గమనిస్తూ ఉంటారు. గోల్ కీపర్ కూడా బంతిని దాదాపు వదిలేశాడనుకుంటున్న తరుణంలో భుజంతో గోల్ వేయొచ్చని ఇలా చూపించాడు. రొనాల్డొ ఇంతకు ముందు 2009లో రికార్డు స్థాయిలో రూ.730 కోట్ల ధరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ నుంచి రియల్‌ మాడ్రిడ్‌కు తరలివచ్చాడు.

Story first published: Wednesday, August 1, 2018, 16:05 [IST]
Other articles published on Aug 1, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X