న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఆటలో అడ్డం తగిలే టాప్ ఆటగాళ్ల జాబితా.. ఇదే

VAR technology not perfect but ready for World Cup - FIFA director

హైదరాబాద్: ఫిఫా వరల్డ్‌కప్‌-2018కి రష్యా సర్వం సిద్ధమవుతోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ విశ్వసంబరానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ, ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ బ్రెజిల్‌, మాజీ ఛాంపియన్లు అర్జెంటీనా, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాళ్లతో జోరుమీదున్నాయి. దీంతో పాటుగా ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలిసారిగా రిఫరీకి తోడుగా సాంకేతికతను జోడించనున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఆటగాళ్లతో పాటే రిఫరీ.. మైదానంలో పరుగెడుతూ.. వాళ్లు తప్పు చేసిన ప్రతిసారి మ్యాచ్‌ను ఆపి సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆయనదే. వీడియో అసిస్టెంట్‌ రిఫరీలు(వీఏఆర్‌) అతనికి సహాయం అందిస్తారు. అయితే ఫిఫా ఆరంభానికి ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నా.. ఈ రిఫరీ సిస్టమ్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు.

వివాదాస్పద ఆటగాళ్ల వీరే:

వివాదాస్పద ఆటగాళ్ల వీరే:

మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన విషయంలోనూ నియమ నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. ప్రత్యర్థిని కొట్టినా, పడగొట్టినా అందుకు ప్రయత్నించినా, అడ్డుకున్నా, ప్రత్యర్థిపై దూకినా, ఉమ్మినా, ఉద్దేశపూర్వకంగా బంతిని పట్టుకున్నా దాన్ని ఫౌల్‌గా పరిగణిస్తారు. ఇక హద్దు మీరి ప్రవర్తిస్తే పసుపు, ఎరుపు కార్డులు చూపించి రిఫరీ చర్యలు తీసుకునే వెసులుబాటు ఉండనే ఉంది. అయితే ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్‌ కొట్టి రికార్డులు సృష్టించిన.. ఆటగాళ్లకో జాబితా ఉన్నట్లుగానే.. దూకుడు ప్రవర్తనతో పసుపు, ఎరుపు కార్డులు ఎదుర్కొన్న ఆటగాళ్లకు కూడా ఫుట్‌బాల్‌ చరిత్రలో ఓ జాబితా ఉంది.

గత ప్రపంచకప్‌ నుంచి నాలుగేళ్లుగా ఆటగాళ్లు సంబంధిత క్లబ్‌లకు ఫుట్‌బాల్‌ ఆడుతూ.. అత్యధికంగా కార్డులు అందుకొని ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న టాప్‌-10 ఆటగాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిస్తే..

స్పెయిన్ ప్లేయర్.. సెర్జియో రమోస్:

స్పెయిన్ ప్లేయర్.. సెర్జియో రమోస్:

ఈ జాబితాలో స్పెయిన్‌ ఆటగాడు సెర్జియో రమోస్‌ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు ఆడిన ఇతను 161 క్లబ్‌ మ్యాచ్‌లలో అతి ప్రవర్తనతో మొత్తం 63పసుపు, ఎరుపు కార్డులు ఎదుర్కొన్నాడు. అతని తర్వాత మరో స్పెయిన్‌ ఆటగాడైన డానీ కార్వాజల్‌ ఉన్నాడు. రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కే ఆడుతున్న ఇతను గత నాలుగేళ్లలో 155మ్యాచ్‌లాడి మొత్తం 58 హెచ్చరిక కార్డులు ఎదుర్కొన్నాడు.

వారితో పాటు వీళ్లు కూడా.. :

వారితో పాటు వీళ్లు కూడా.. :

తర్వాతి స్థానాల్లో ఎన్జో పెరేజ్‌(అర్జెంటీనా-55), గాబ్రియల్‌ మేర్కాడో(అర్జెంటీనా-54), కాస్మిరో(బ్రెజిల్‌-54), డేవిడ్‌ గజ్‌మన్‌(కోస్టారికా-53), గ్రానిట్‌ జ్సికా(స్విట్జర్లాండ్‌-52), నికోలస్‌ ఒటమేండీ(అర్జెంటీనా-49), గెరార్డ్‌ పైక్‌(స్పెయిన్‌-49), ఎవర్‌ బనేగా(అర్జెంటీనా-48) ఈ నాలుగేళ్లుగా వివిధ క్లబ్‌లకు ఆడుతూ అతి ప్రవర్తనతో హెచ్చరిక కార్డులు అందుకున్న వారే.

అసలు అవే కార్డులు ఎందుకంటే:

అసలు అవే కార్డులు ఎందుకంటే:

ఆటగాడిని హెచ్చరించేందుకు ముందుగా పసుపు కార్డును ఉపయోగిస్తారు. క్రీడాస్ఫూర్తికి భిన్నంగా నడుచుకున్నా, నిబంధనలు ఉల్లంఘించినా.. దీనిని ఉపయోగిస్తారు. ఐతే ఒకే మ్యాచ్‌లో ఆటగాడు రెండో ఎల్లో కార్డు ఎదుర్కొంటేనే ప్రమాదం. ఇక అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం రిఫరీ రెడ్‌ కార్డు చూపించి మైదానంలో నుంచి గెంటేస్తాడు. ఒకవేళ ఒకే మ్యాచ్‌లో రెండో పసుపు కార్డు ఎదుర్కొంటే.. వెంటనే అతడికి రెడ్‌ కార్డును చూపించి బయటికి పంపించేస్తారు.

Story first published: Wednesday, June 13, 2018, 14:21 [IST]
Other articles published on Jun 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X